ఆ ఇద్దరి స్నేహం బాపు, రమణ మాదిరిగా.. వీజే సన్నీ సౌండ్ పార్టీలో శివన్నారాయణ ఎమోషనల్

బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెంబ‌ర్-1గా రూపొందుతోన్న చిత్రం సౌండ్ పార్టీ. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో డైర‌క్ట‌ర్ సంప‌త్ నంది చేతుల మీదుగా సౌండ్ పార్టీ టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ టీజర్ ఈవెంట్‌లో ప్రముఖులు మాట్లాడుతూ..

సౌండ్ పార్టీ మూవీని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. జ‌య‌శంక‌ర్ స‌పోర్ట్ తో సంజ‌య్ సినిమా చాలా బాగా చేశాడు. శివ‌న్నారాయ‌ణ గారు నేను తండ్రికొడుకులుగా న‌టించాం. సినిమా అంతా ఇద్ద‌రం ఫుల్ గా నవ్విస్తాం. మోహిత్ అద్భ‌తుమైన మ్యూజిక్ ఇచ్చాడు. అంద‌రూ ఫ్యామిలీతో వెళ్లి మా సినిమా చూసి పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నా అని హీరో వీజే స‌న్ని అన్నారు.

Sivannarayana

సౌండ్ పార్టీ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అమృత ఫేమ్ న‌టుడు శివ‌న్నారాయ‌ణ మాట్లాడుతూ.. మా సినిమాకు మొదటి నుంచి మీరు అండగా ఉంటున్నారు. వీజే సన్నీ ఏం మాట్లాడినా నేను ముందు జర్నలిస్టును, ఆ తర్వాతే సినిమా యాక్టర్‌ను అని అంటాడు. అలాగే ఈ సినిమాకు సంబంధించి మా డైరెక్టర్‌ సంజయ్‌కు ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఊహించుకొని 2016లో కథ రాశానని చెప్పాడు. 2016 నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని న‌టుడు శివ‌న్నారాయ‌ణ తెలిపారు.

Sivannarayana

సంజయ్‌ను పరిచయం చేస్తున్న జయశంకర్ గ్రేట్. సినిమా పరిశ్రమలో స్నేహం గురించి చెప్పుకొంటే.. బాపు, రమణ గురించి చెప్పుకొంటారు. కానీ ఇప్పుడు వారు లేరు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో చెప్పుకోవాల్సి వస్తే.. సంజయ్, జైశంకర్ అలా కనిపిస్తారు. ప్రతీ క్షణం వారిద్దరూ సెట్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఒకరినొకరు ఓ ఆపరేట్ చేసుకొంటారు. ఎవరికి వారు చూసుకొనే రోజుల్లో స్నేహితుడి గురించి జైశంకర్ తీసుకొన్న కేర్ గొప్పగా కనిపించింది. ఈ సినిమా నిర్మాత జయశంకర్ ద్వారా రావడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ అని న‌టుడు శివ‌న్నారాయ‌ణ అన్నారు.

నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ... ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కిస్తోన్న ఫుల్ ఎంట‌ర్ టైన్మెంట్ చిత్రం సౌండ్ పార్టీ. దీనికి మా టీమ్ అంతా కూడా ఎంతో స‌పోర్ట్ చేసింది. ప్రేక్ష‌కులకు మా చిత్రం టీజ‌ర్ న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. మా టీజ‌ర్ రిలీజ్ చేసిన సంప‌త్ నంది గారికి కృత‌జ్ఞ‌త‌లు. సెప్టెంబర్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. యంగ్ టాలెంట్ ని ఎంక‌రేజ్ చేస్తూ న్యూ ఏజ్ స్టోరీస్ తో సినిమాలు చేయాల‌న్న సంక‌ల్పంతో ఫుల్ మూన్ ప్రొడ‌క్ష‌న్స్ స్థాపించాము. ఇక మీద‌ట కంటిన్యూయ‌స్ గా మా బేన‌ర్ నుండి సినిమాలు వస్తాయ‌న్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X