పెళ్లి చేసుకోకపోతే ప్రాబ్లమ్ ఉన్నట్టా? మీ చెల్లిని పంపిస్తావా? కమెడియన్‌‌కు యాక్టర్ హర్షవర్ధన్ షాక్

అమృతం సీరియల్ అనగానే గుర్తొచ్చే వారిలో హర్షవర్ధన్ ఒకరు. నటుడిగా రైటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మనం, గుండెజారి గల్లంతయ్యిందే అనే సినిమాలకు రైటర్ గా కూడా వర్క్ చేశారు. కెరీర్ లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని హర్ష వర్ధన్ పర్సనల్ లైఫ్ లో ఒంటరిగానే ఉంటున్నాడు. ముఖ్యంగా ఆయన పెళ్లి చేసుకోలేదన్న విషయం చాలా మందికి తెలియదు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జీవితానికి సంబంధించిన విషయాల గురించి వివరణ ఇచ్చారు.

అమృతం హర్షవర్ధన్..

అమృతం హర్షవర్ధన్..

హర్షవర్ధన్ కెరీర్ మొదటి నుంచి ఒక దర్శకుడు అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నటుడిగా క్లిక్కయిన తరువాత అమృతం సిరియల్ లో ఆఫర్ వచ్చింది. సీనియర్ కమెడియన్ గుండు హనుమంతరావు కాంబినేషన్ లో వచ్చిన ఆ సీరియల్ కొన్నేళ్ల పాటు టాప్ రేటింగ్స్ అందుకుంది. హర్షవర్ధన్ అమృతం సీరియల్ తోనే జనాలకు అమితంగా దగ్గరయ్యాడు.

ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే..

ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే..

హర్షవర్ధన్ పెళ్లి చేసుకోలేదన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే అందుకు కారణాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మనం ఎదో సాధించాలని ఇండస్ట్రీకి వచ్చాము. మనల్ని నమ్మి మనతో వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఆమెకు నచ్చినట్లుగా నేను ఉండలేను. సరైన సమయాన్ని కూడా కేటాయించలేనని చెబుతూ.. ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

పెళ్లి అనేది పబ్లిక్ టాయిలెట్ లాంటిది.

పెళ్లి అనేది పబ్లిక్ టాయిలెట్ లాంటిది.

'నిజ జీవితంలో పెళ్లి అనేది అందరికి ఉండాలని రూల్ ఏమి లేదు. ఎంతో మంది ఎన్నో అంటుంటారు.పెళ్లిపై ఒక మంచి కొటేషన్ ఉంది. పెళ్లి అనేది పబ్లిక్ టాయిలెట్ లాంటిది. బయట ఉన్నవాడు ఎప్పుడు లోపలికి వెళదామా అని అనుకుంటాడు. లోపల ఉన్నవాడు ఎప్పుడు బయటకు వద్దామా అని అనుకుంటాడు' అని హర్షవర్ధన్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.

స్టార్ కమెడియన్ అలా అనగానే..

స్టార్ కమెడియన్ అలా అనగానే..

'సాధారణంగా పెళ్లి చేసుకోకపోతే.. చాలా మంది ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఇలానే ఒక కమెడియన్ నాతో ఇన్ డైరెక్ట్ గా అలానే మాట్లాడాడు. అందుకు ఆయన ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగితే నేను కెరీర్ కోసమని చెప్పా..అందుకు ఆయన అదొక బాధ్యత అంటూ.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నీలనే అంటే.. ఏమైనా ప్రాబ్లమ్ ఉందా' అని ఆడిగేసానని ఆయన చెప్పినట్లు హర్ష వివరణ ఇచ్చాడు. అదే తరహాలో తను కూడా ఒక కౌంటర్ ఇచ్చినట్లు చెప్పాడు.

Recommended Video

R Narayana Murthy About LB Sriram Greatness
 మీ చెల్లిని పంపిస్తారా?

మీ చెల్లిని పంపిస్తారా?

'కమెడియన్ వేసిన సెటైర్ కి నాకు కోపం వచ్చింది. వెంటనే మనసులో ఉన్న ఒక చురుకైన సమాధానం ఆయనకు తగిలేలా అలానే చెప్పాను. నన్ను కూడా ఒక వ్యక్తి ఇలానే అడిగాడు సార్.. వెంటనే అతని చెల్లిని లేదా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పంపిస్తే విషయం ఉందొ లేదో తెలిసేలా చేస్తానని ఆడిగేసాను సర్..' అంటూ ఆ స్టార్ కమెడియన్ కి సమాధానం చెప్పినట్లు హర్షవర్ధన్ వివరణ ఇచ్చాడు. అనంతరం ఆ కమెడియన్ ఒక గంట తరువాత పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ అని మళ్ళీ పాజిటివ్ గా మాట్లాడినట్లు చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X