Amy Jackson Baby: మరోసారి మగబిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్.. బాబు పేరేంటో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా పెళ్లిళ్లు, ఎఫైర్స్ , విడాకుల వార్తలే కనిపిస్తున్నాయి. ఏ ఛానెల్, వెబ్‌సైట్ చూసినా ఇలాంటి వార్తలే ఉండటంతో జనాలకు విసుగొస్తుంది. ఇలాంటి న్యూస్ మధ్య ఓ శుభవార్త చెప్పారు ఇంగ్లీష్ భామ అమీ జాక్సన్. కొద్దినెలల క్రితం గర్భం దాల్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించిన అమీ జాక్సన్ తాజాగా బిడ్డ, భర్తతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకున్నారు.

హేమాహేమీల్లాంటి అమ్మాయిల మధ్యలో ఓ విదేశీ మహిళ భారతీయ చిత్ర పరిశ్రమలో రాణించడం అరుదు. అలాంటిది తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు అమీ జాక్సన్. యూకేకు చెందిన ఈ ముద్దుగుమ్మ చదువు పూర్తి చేసి ఆ తర్వాత మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. మిస్ టీన్ లివర్‌పూల్, మిస్ టీన్ గ్రేట్ బ్రిటన్ కాంటెస్ట్‌లలో విజయం సాధించి నలుగురి దృష్టిలో పడ్డారు. 2009లో మిస్ టీన్ వరల్డ్ కాంటెస్ట్‌లోనూ కిరీటం దక్కించుకున్నారు.

Amy Jackson shares First photo of second Baby Boy Picture goes viral on Instagram

మోడలింగ్‌లో పీక్స్ చూసిన అమీ జాక్సన్ .. మిస్ లివర్‌పూల్ (2010), మిస్ ఇంగ్లాండ్ (2010)లలో పాల్గొన్నారు. ఈ క్రమంలో భారతీయ దర్శక నిర్మాతల కళ్లలో పడ్డ అమ్మీ జాక్సన్‌కు తొలుత తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఆహ్వానం అందింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ఆర్య నటించిన మద్రాస్ పట్టణం సినిమాలో తెల్ల దొరసానిగా అద్భుతంగా నటించారు. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా అమీకి మిగిలిన భాషల నుంచి ఆఫర్లు అందాయి.

ఎవడు, అభినేత్రి చిత్రాలతో తెలుగు వారిని కూడా మెస్మరైజ్ చేశారు. ఈ దశలో లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన ఐ (మనోహరుడు) సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకున్నారు. అనంతరం రోబో 2.0, క్రాక్, మిషన్ చాప్టర్ 1 సినిమాలలో నటించారు. వ్యాపారవేత్త జార్జ్ పనయోటుతో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమ్మీ గర్భందాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అనూహ్య పరిణామాల మధ్య జార్జ్‌తో బంధం బెడిసి కొట్టగా కొద్దిరోజులకే ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడి ఆయనను గతేడాది పెళ్లాడారు అమీ జాక్సన్.

ఇటీవల తాను రెండోసారి గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన అమీ.. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేశారు. తాజాగా నెలలు నిండటంతో మరోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. భర్త వెస్ట్‌విక్‌తో కలిసి చిన్నారితో ఉన్న ఫోటోను అమీ జాక్సన్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌లోనే తన బిడ్డ పేరు కూడా ప్రస్తావించారు ఈ ముద్దుగుమ్మ. సినీరంగంలో తలమానికంగా భావించే ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్‌ పేరు కలిసొచ్చేలా.. తన బిడ్డకు ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్‌విక్ అని నామకరణం చేసినట్లుగా అమీ జాక్సన్ తెలిపారు. ప్రస్తుతం చిన్నారి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అమీ జాక్సన్ దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Read more about: amy jackson ed westwick
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X