ఒకరు బతకాలంటే.. ఇంకొకరు చావాలి.. అదే సృష్టి.. పాయల్ రాజ్‌పుత్ ఫైర్ బ్రాండ్ ఫెర్ఫార్మెన్స్

ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై రాజా రాంమూర్తి, చిదంబరం నటేషన్ నిర్మాతలుగా దయాల్ పద్మానాభన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అనగనగా ఓ అతిథి. కన్నడ చిత్రం ఆధారంగా రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ, ఆనంద చక్రపాణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే...

హై ఓల్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌తో

హై ఓల్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌తో

అనగనగా ఓ అతిథి చిత్రం టీజర్ చూస్తే.. యాక్షన్, సస్పెన్స్, థిల్లర్ మూవీ అనేది స్సష్టమైంది. ఇంటెన్స్ డ్రామా, హై ఓల్టేజ్ ఫెర్పార్మెన్స్‌ ప్రతీ పాత్రలో కనిపించింది. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్ చేత చెప్పించిన డైలాగ్స్ సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తిని రేపేలా ఉన్నాయి. ఆమెలోని భావోద్వేగమైన నటన మరింత ఆకట్టుకొనేలా ఉంది.

 పవర్ ఫుల్ డైలాగ్స్‌తో

పవర్ ఫుల్ డైలాగ్స్‌తో

అనగనగా ఓ అతిథి చిత్రంలో డైలాగ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 'చూడ్డానికి మొరటుగానే కనిపిస్తున్నావు గానీ.. మనసు మంచిదే', ‘ఇప్పుడు నేను లంజను అంటా, అంతేగా', ‘రక్తం అంటించుకో వద్దని అంటున్నాను'. ‘ఒకరు బతకాలంటే.. ఇంకొకరు చావాలి.. అదే సృష్టి', ‘ఆరు నూరైనా నేను చేయాలనుకొన్నది చేసేస్తాను' లాంటి డైలాగ్స్ సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని స్పష్టం చేశాయి.

ఆనంద చక్రపాణి స్పెషల్‌గా

ఆనంద చక్రపాణి స్పెషల్‌గా

ఇక అనగనగా ఓ అతిథి చిత్రంలో మల్లేశం ఫేమ్ ఆనంద చక్రపాణి పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించింది. భయమా? మాకా అంటూ ఆయన భావోద్వేగంతో చెప్పిన డైలాగ్స్ ఆసక్తిని కలిగించాయి. అలాగే కళ్లతో ఆయన చూపించిన హావభావాలు కథలోని ఇంటెన్సిటిని స్పష్టంగా చెప్పేశాయి. ఇంకా అన్ని పాత్రలు విభిన్నంగా కనిపిస్తున్నాయి. టీజర్ చూస్తే.. మంచి సినిమాను చూడబోతున్నామనే ఫీలింగ్‌ను మొదటి ప్రయత్నంలోనే కలిగించడం గమనార్హం. కన్నడలో ఉత్తమ నటి అవార్డు అందుకొన్న వీణా సుందర్ ఈ చిత్రంలో కూడా తల్లి పాత్రలో మెప్పించబోతున్నట్టు కనిపించింది.

ఆహాలో 20వ తేదీన రిలీజ్

ఇక టీజర్‌ను కట్ చేయడంలో చాలా ఇంటెలిజెంట్‌గా వ్యవహరించినట్టు కనిపించింది. హీరో చైతన్య కృష్ణ క్యారెక్టర్‌ను లో ప్రొఫైల్‌లో చూపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సీన్లను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందనే ఫీలింగ్ కలిగించింది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న అనగనగా ఓ అతిథి చిత్రం నవంబర్ 20వ తేదీన ఆహా యాప్‌లో రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X