Anaganaga Oka Raju Public Talk: అనగనగా ఒక రోజు పబ్లిక్ టాక్ ఏంటి? పోలిశెట్టి మూవీ హిట్టా? ఫట్టా?

Anaganaga Oka Raju Public Talk: యువ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ అనగనగా ఒక రోజు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' వంటి హిట్స్ తర్వాత హీరో నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కావడంతో, రిలీజ్ ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది. పాటలు, ట్రైలర్‌కు వచ్చిన స్పందన కూడా సినిమాపై హైప్‌ను పెంచింది. నేడు విడుదలైన ఈ మూవీ పబ్లిక్ టాక్, సోషల్ మీడియా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? సంక్రాంతి రేసులో గట్టిపోటీ ఇవ్వబోతుందా? అనే వివరాలు.

టాలీవుడ్‌లో యువ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం అనగనగా ఒక రాజు సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పించింది. తొలి చిత్ర దర్శకుడిగా మారి తెరంగేట్రం చేసిన డైరెక్టర్ మారి, ఈ సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ప్రమోషనల్ కంటెంట్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ బజ్ నెలకొంది.

Anaganaga Oka Raju Public Talk

ఈ నేపథ్యంలో ' అనగనగా ఒక రోజు' సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగిన కథ, గోదావరి అందాలు, సంప్రదాయ కుటుంబ విలువలు కలిసి సినిమాకు మంచి ప్లస్ అయ్యాయని ప్రేక్షకులు చెబుతున్నారు. కథ లైన్ పెద్దగా కొత్తది కాకపోయినా, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం, ముఖ్యంగా కామెడీ ట్రాక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని పబ్లిక్ టాక్. 'చాలా రోజుల తర్వాత థియేటర్‌లో కడుపుబ్బా నవ్వుకున్నాం' అనే కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

హీరో నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే.. ఈ సినిమా పూర్తిగా ఆయన వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్ని కలిపి మరోసారి తన మార్క్ చూపించాడని అభిమానులు అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్, ఎలక్షన్ క్యాంపెయిన్ సీన్స్, పప్పీ ఎపిసోడ్ లాంటి భాగాలు థియేటర్‌లో లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్‌గా మారాయి. 'జాతిరత్నాలు' తర్వాత ఇంత స్ట్రాంగ్ కామెడీ పర్ఫార్మెన్స్ ఇదే అన్న మాట కూడా వినిపిస్తోంది.

ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. ఆమె రోల్ సింపుల్‌గా ఉన్నప్పటికీ, నవీన్‌తో కెమిస్ట్రీ బాగా వర్క్ అయ్యిందని ప్రేక్షకులు చెబుతున్నారు. గ్లామర్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆమె నటన మెచ్చుకోదగినదిగా మారింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఆమె క్యారెక్టర్ కనెక్ట్ అవుతుందని టాక్.

ఇక డైరెక్షన్ పరంగా చూస్తే, డెబ్యూ డైరెక్టర్ మారి లైట్ హార్టెడ్ ట్రీట్‌మెంట్‌తో సినిమాను ముందుకు నడిపించాడు. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీతో సాగి ఎంటర్‌టైన్ చేయగా, ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకు మంచి హై ఇచ్చిందని ప్రేక్షకులు అంటున్నారు. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్, ఎలక్షన్ ట్రాక్ ఉన్నప్పటికీ కొందరికి అక్కడక్కడా డ్రాగ్ అనిపించిందన్న అభిప్రాయం ఉంది. అయితే కామెడీ సీన్స్ ఆ లోటును కవర్ చేశాయని మెజారిటీ టాక్.

సంగీతం విషయానికి వస్తే, మిక్కీ జే మేయర్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా పాటలు థియేటర్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. పాటలు వచ్చినప్పుడు ప్రేక్షకులు హుషారుగా ఎంజాయ్ చేస్తున్నారని టాక్. ఇలా మొత్తగా చూస్తే.. 'అనగనగా ఒక రాజు' సినిమా సంక్రాంతి సీజన్‌కు సరిపోయే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ రొటీన్ అయినా, కామెడీ, పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ వల్ల సినిమాను థియేటర్‌లో హాయిగా ఎంజాయ్ చేయవచ్చని పబ్లిక్ టాక్ చెబుతోంది. ఓపెనింగ్ టాక్ స్పష్టంగా పాజిటివ్‌గా ఉండటంతో, ఈ సినిమా హిట్ దిశగా సాగుతుందన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లోనూ కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X