Anaganaga Oka Raju Trailer Review: అనగనగా ఒకరాజు ట్రైలర్ రివ్యూ
స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా తెరకెక్కిన మూవీ అనగనగా ఒకరాజు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. పెద్ద పండగకి కావాల్సిన అన్ని రకాల ఎలిమింట్స్‌తో అనగనగా ఒకరాజు సినిమాను సిద్ధం చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. తాజాగా అనగనగా ఒకరాజు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉంది? నవీన్, మీనాక్షిలు ఎలా చేశారు? పరిశీలిస్తే..
అనగనగా ఒకరాజు చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ సినిమాకు వై యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప 2 ఫేమ్ తారక్ పొన్నప్ప, రావు రమేశ్, గోపరాజు రమణ, జబర్దస్త్ సత్యశ్రీ, కాదంబరి కిరణ్, చమ్మక్ చంద్ర, మహేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా జనవరి 8న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనిని పరిశీలిస్తే.. 2.52 నిమిషాల నిడివితో ట్రైలర్ కట్ చేశారు. విక్టరీ వెంకటేష్ క్లాసిక్ సాంగ్ బలపం బట్టి భామ ఒళ్లో బ్యాక్‌డ్రాప్‌లో ప్లే అవుతుండగా హీరో నవీన్ పొలిశెట్టి ఎంట్రీ ఇస్తాడు. ఈ ట్రైలర్‌కు కింగ్ అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చారు.
అనగనగా ఒకరాజు... ఆ రాజుకు చాలా పెద్ద మనసు అంటూ నాగ్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఎన్నిసార్లు చెప్పాను హుండీ కన్నం పెద్దది చేయమని, నోట్లు పట్టడం లేదని అంటాడు నవీన్. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామని పంతులుగారు చెప్పగా.. చిల్లరగాళ్ల కోసం సెపరేట్ హుండీ చేయించండి అని పంచ్ విసురుతాడు నవీన్. ఆ తర్వాత పంతులుగారితో తన పెళ్లి గురించి, కాబోయే మామగారు ఎలా ఉండాలో చెబుతాడు నవీన్. ఇంతలో హీరోయిన్ మీనాక్షి చౌదరి అచ్చతెలుగు ఆడపిల్లలా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో గ్లామర్‌తో పాటు తొలిసారిగా హ్యూమర్ కూడా పండించారు మీనాక్షి. హీరోయిన్‌ని ఇంప్రెస్ చేయడానికి హీరో పడే తిప్పలు, ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వచ్చే సరదా సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
పల్లెటూరి వాతావరణం, హీరో హీరోయిన్ల ప్రేమ, కాబోయే అల్లుడికి మామగారు పెట్టే పరీక్ష, మధ్యలో విలన్‌తో సవాల్ ఇలా ఆధ్యంతం ట్రైలర్ సరదాగా సాగిపోయింది. నవీన్ పొలిశెట్టి తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్‌తో నవ్వులు పూయిస్తుండగా... మీనాక్షి చౌదరి క్యారెక్టర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. వీరిద్దరి కెమెస్ట్రీ, సరదా సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథలో పెద్దగా సీరియస్ డ్రామా లేకుండా కేవలం వినోదమే కీ పాయింట్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతానికి తోడు యువరాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. మరి రాజు గారు తన రాణిని దక్కించుకున్నారా? విలన్‌పై హీరో గెలిచాడా? లేదా తెలియాలంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











