అనగనగనగా... ‘అరవింద సమేత’ సాంగ్ ప్రోమో అదిరిపోయింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత వీర రాఘవ' మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 24 గంట్లల్లో ఒక్క యూట్యూబ్‌లోనే 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
కల్యాణ్ రాం ఎమోషనల్.. ఎన్టీఆర్ కంటతడి.. గుండెల్ని పిండేసిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
తాజాగా ఈ మూవీలోని 'అనగనగనగా...' వీడియో సాంగ్ ప్రోమో సంగీత దర్శకుడు తమన్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. స్టైలిష్ లుక్‌తో ఎన్టీఆర్ సూపర్బ్ అనేలా ఉన్నాయి. ఎన్టీఆర్-పూజా హెగ్డేలపై ఫారిన్ లోకేషన్లో చిత్రీకరించిన ఈ పాట రేపు థియేటర్లో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ వీర రాఘవ అనే పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ పూజా హెడ్గే పాత్ర పేరు అరవింద. వీరి ప్రేమ కథకు ముడి పెడుతూ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో డైలాగ్స్ పరిశీలిస్తే... త్రివిక్రమ్ మరోసారి తనదైన డైలాగులతో అదరగొట్టాడని స్పష్టమవుతోంది.

హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, నాగబాబు, సునీల్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











