రష్మికను వదినా అని పిలిచారు కదా.. రిపోర్టర్ ప్రశ్నకు ఆనంద్ దేవరకొండ ఆన్సర్ ఇదే!
గీత గోవిందం సినిమాతో తెలుగులో సూపర్ పాపులర్ అయిన జంట విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా. ఈ సినిమాతో వీళ్లిద్దరు పెయిర్ గా ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకున్నారు. వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారని తెలగ రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాటిని పరోక్షంగా ఇద్దరూ ఖండిస్తూ వచ్చిన పుకార్లు మాత్రం ఆగట్లేదు.
ఇక మన అభిమాన హీరోలను అన్నా అని పిలవడం సహజమే. సో అలా రష్మిక మందన్నాను విజయ్ ఫ్యాన్స్ వదినా అంటూ పిలిచి రచ్చ చేస్తారు. తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ కు ప్రశ్న ఎదురైంది. మరి దానికి ఆనంద్ దేవరకొండ ఎలా రియాక్ట్ అయ్యాడనే విషయంలోకి వెళితే..

వివాదం కూడా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తనదైన శైలీలో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆనంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బేబీ (Baby 2023). ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ తోపాటు కాస్తా వివాదస్పదం అయ్యాయి.

గ్లామర్ వరకు: ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ బేబీలో ది సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీసుతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సాధించుకున్న సంపాదించుకున్న వైష్ణవి చైతన్య మరో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే విరాజ్ అశ్విన్ కూడా నటిస్తున్నాడు. బేబీ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంతో రానుండగా.. వైష్ణవి చైతన్య డీ గ్లామరస్ రోల్ నుంచి పాష్ యువతిగా మారే పాత్ర చేసింది.

జూలై 14న: బేబీ సినిమాను డైరెక్టర్ మారుతీ, ఎస్‍కేఎన్ (శ్రీనివాస కుమార్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తోన్న బేబీ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. సాయి రాజేష్ ఇదివరకు జాతీయ అవార్డ్ గెలుచుకున్న కలర్ ఫొటో మూవీకి కథ అందించారు. విజయ్ బుల్గాన్ సంగీతం అందించిన బేబీ సినిమా జూలై 14న విడుదలకు సిద్ధంగా ఉంది.
వదినా అని పిలిచారు: అయితే తాజాగా బేబీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండ పాల్గొన్నారు. ఇందులో తనకు కథ ఎంతో నచ్చిందని, ఇది తప్పకుండా తన కెరీర్ కు మంచి సక్సెస్ అందిస్తుందని ఆనంద్ దేవరకొండ తెలిపాడు. ఈ క్రమంలోనే "మీ సినిమాలోని ఓ పాటను రష్మిక విడుదల చేశారు కదా. ఆ సాంగ్ ఈవెంట్ కు వచ్చిన వాళ్లందరూ ఆమెను 'వదినా' అని గట్టిగా పిలిచారు కదా" అని రిపోర్టర్ ప్రశ్నించారు.

మిడిల్ ఫింగర్ పోస్టర్: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ దేవరకొండ కాస్తా అసహనం వ్యక్తం చేశాడు. "లేదు. నేను దీన్ని ఇక్కడితో ఆపేస్తాను" అని ఆనంద్ సమాధానం ఇచ్చాడు. తర్వాత ఇదే ఇంటర్వ్యూలో మిడిల్ ఫింగర్ తో అమ్మాయిని చూపించిన పోస్టర్ డిలీట్ చేయడం గురించి ఆనంద్ దేవరకొండను ప్రశ్నించారు.
నెగెటివిటీ ఎందుకు?: "మూవీ టీజర్, ట్రైలర్, మ్యూజిక్ కు మంచి ఆదరణ వచ్చినట్లే పోస్టర్లకు మంచి టాక్ వచ్చింది. సినీ ప్రియులకు పోస్టర్స్ ఎంతగానో నచ్చాయి. కానీ, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కు మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ఇదేం పోస్టర్ అని కామెంట్ చేశారు. నెగెటివ్ గా ఉందన్నారు. దాంతో నెగెటివిటీ ఎందుకని చెప్పి డిలీట్ చేశాం" అని ఆనంద్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











