అమెజాన్‌లో మిడిల్ క్లాస్ మెలోడిస్ రిలీజ్.. ఆనంద్ దేవరకొండ మూవీకి క్రేజీ బజ్
ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై యువ హీరో ఆనంద్ దేవరకొండ, యువ హీరోయిన్ వర్ష బొల్లమ్మ జంటగా యువ దర్శకుడు వినోద్ దర్శకత్వం వహిస్తున్న మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు అనూహ్యమైన స్పందన లభించింది.
ఇటీవల విడుదలైన మిడిల్ క్లాస్ మెలోడిస్ ట్రైలర్‌కు అమెజాన్ ప్రైమ్ వీడియోలో 13 మిలియన్ల వ్యూస్ రావడం ఓ రికార్డుగా మారింది. ఇప్పటికే ట్రైలర్‌లో వచ్చిన కంటెంట్ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. దీంతో ఈ సినిమాపై ప్రత్యేకమైన బజ్ క్రియేట్ అయింది.

మిడిల్ క్లాస్ మెలోడిస్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆనంద్ దేవరకొండ తెలుగు ఫిల్మ్‌బీట్‌తో మాట్లాడుతూ.. మధ్య తరగతి కుటుంబాలనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే ఎమోషన్స్, వినోదం చిత్రంలో ఉన్నాయి. దర్శకుడు వినోద్ అనంతోష్ రాసుకొన్న కథ ప్రతీ ఒక్కరిని కదిలిస్తుంది. ఈ సినిమాలోని సన్నివేశాలు ప్రేక్షకుల జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయని అని అన్నారు.
నవంబర్ 20వ తేదీన మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. అంటే ఈ చిత్రం నవంబర్ 19వ తేదీ అర్దరాత్రి 12 గంటలకు ప్రీమియర్ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించారు.
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, గోపరాజు రమణ తదితరులు
దర్శకత్వం: వినోద్ అనంతోజు
నిర్మాత: వీ ఆనంద్ ప్రసాద్
కథ, డైలాగ్స్: జనార్ధన్ పసుమర్తి
స్క్రీన్ ప్లే: వినోద్ అనంతోజు, జనార్ధన్ పసుమర్తి
మ్యూజిక్: శ్రీకర్ అగస్తి, ఆర్ హెచ్ విక్రమ్
సినిమాటోగ్రఫి: సన్ని కూరపాటి
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
బ్యానర్: భవ్య క్రియేషన్
రిలీజ్ డేట్: 2020-11-20
ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో


Click it and Unblock the Notifications











