Pushpaka Vimanam : 'పెళ్లాం లేచిపోయిందా?'.. రచ్చ రేపుతున్న ట్రైలర్!
విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ దేవరకొండ తనకంటూ ఒక సపరేట్ గుర్తింపు తెచ్చుకోవడానికి యత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన నటించిన రెండు సినిమాలు విడుదల కాగా రెండు సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆయన హీరోగా వస్తున్న మూడో సినిమా ట్రైలర్ అల్లు అర్జున్ కొద్ది సేపటి క్రితం లాంచ్ చేశారు ఆ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

మూడో సినిమా
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆనంద దేవరకొండ దొరసాని అనే పూర్తి తెలంగాణ నేపథ్యమున్న సినిమాతో లాంచ్ అయ్యాడు.. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ఆనంద్ కమర్షియల్గా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు.. ఆయన హీరోగా వచ్చిన రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి టాక్ తెచ్చుకునా అది ఓటీటీ వేదికగా విడుదల కావడంతో అది హిట్ ఖాతాలో వేయలేము..
అల్లు అర్జున్ చేత
ఇక ఆయన హీరోగా వస్తున్న మూడో సినిమా పుష్పక విమానం ఎట్టకేలకు విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ సినిమాను విజయ్ దేవరకొండ సమర్పిస్తూ ఉండగా దేవరకొండ బ్రదర్స్ తండ్రి గోవర్ధన్ రావు నిర్మిస్తున్నారు.. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలు తలకెత్తుకున్న విజయ్ దేవరకొండ స్పెషల్ ఇంటర్వ్యూ విడుదల చేయగా ఈ సినిమా ట్రైలర్ ను అల్లు అర్జున్ చేత చేయించారు.

ప్రభుత్వ ఉద్యోగి కథ
ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది అని చెప్పక తప్పదు ఎందుకంటే ఎవరూ చేయని కథతో ఈ సినిమా చేసినట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రకారం భార్య లేచిపోయిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కదే ఈ పుష్పక విమానం. ఒక ప్రభుత్వ టీచర్ పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత, భార్య ఉన్నట్టుగానే అందరికీ కలరింగ్ ఇస్తాడు.

పెళ్ళాం లేచిపోయిన భర్త
హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి భార్య చేసిందని స్కూల్ స్టాఫ్ అందరికీ తినిపించడం, అపార్ట్మెంట్ లో ఎవరు అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం ఇలా చేస్తూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా తన భార్య కనిపించడం లేదు అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ అప్పటికే ఎస్సైగా పనిచేస్తున్న సునీల్ ఆనంద్ దేవరకొండ మధ్య సాగుతున్న సన్నివేశాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఆసక్తి రేపుతున్న ట్రైలర్
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా గీతా , శాన్వి మేఘన హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నరేష్ హర్షవర్ధన్, భద్రం, సునీల్ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నవంబర్ 12వ తేదీన విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే విజయ్ బ్రదర్స్ సినిమా మీద ఆసక్తి పెంచడానికి ప్రయత్నిస్తుండగా ఈ ట్రైలర్ సినిమా మీద మరింత ఆసక్తి కలిగించింది అని చెప్పక తప్పదు. పెళ్ళాం లేచిపోయిన భర్త అనే కాన్సెప్ట్ మీద ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











