మరో సినిమాతో సిద్దమవుతున్న దేవేరకొండ తమ్ముడు.. బిగిల్ భామతో రొమాన్స్!
యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ అదే తరహాలో తమ్ముడిని కూడా నడిపించాలని అనుకుంటున్నాడు. ఆనంద్ దేవరకొండ గత ఏడాది దొరసాని సినిమాతో ప్రేక్షకులకు ముందుకి వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమా ద్వారా రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. అయితే ఆ సినిమా సరైన సక్సెస్ ఇవ్వలేకపోయింది. కానీ నటనపరంగా ఆనంద్ కి మంచి గుర్తింపుని అంధించింది. ఇకపోతే ఆనంద్ రెండవ సినిమాపై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫైనల్ గా నేడు ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించనున్న న్యూ లవ్ స్టోరీలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక కేరాఫ్ కంచరపాలెం సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.
ఇక హీరోయిన్ గా బిగిల్ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న వర్ష బోళ్లమ్మ హీరోయిన్ గా నటించనుంది. మొత్తానికి దేవరకొండ తమ్ముడు న్యూ టీమ్ తో సెకండ్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











