ఓటీటీలో ఆనంద్ దేవరకొండ రెండవ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్!

యువ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో బాక్సాఫీస్ రౌడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అదే తరహాలో హీరోగా గుర్తింపు పొందాలని విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా చాలానే కష్టపడుతున్నాడు. గత ఏడాది దొరసాని సినిమాతో ప్రేక్షకులకు ముందుకి వచ్చిన ఆనంద్ తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు

ఇక ఆ సినిమా ద్వారా రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఆనంద్ రెండవ సినిమా "మిడిల్ క్లాస్ మెలోడీస్" విడుదలపై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న వస్తున్నాయి. అయితే ఫైనల్ గా నేడు సినిమా విడుదలపై సస్పెన్స్ వీడింది. అందుకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కిస్తున్న మిడిల్ క్లాస్ మెలోడీస్ నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Anand devarakonda second movie ott announcement

డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. కేరాఫ్ కంచరపాలెం సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా బిగిల్ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న వర్ష బోళ్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి దేవరకొండ తమ్ముడు న్యూ టీమ్ తో సెకండ్ సినిమాను తొందరగా స్టార్ట్ చేయడమే కాకుండా చాలా స్పీడ్ గా కూడా ఫినిష్ చేశాడు. మరి ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా యువ హీరోకు ఏ స్థాయిలో క్రేజ్ అందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X