twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్, ఆనంద్ కాంబోలో ‘పుష్పక విమానం’: పోస్టర్‌తో అంచనాలు పెంచేసిన బ్రదర్స్

    |

    ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకడు. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో ఎదిగిపోయిన అతడు.. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను కూడా కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించిన 'దొరసాని'తో సినీ రంగానికి పరిచయం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టినప్పటికీ.. ఆనంద్ నటుడిగా మంచి గుర్తింపును అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో కెరీర్‌లో మొదటి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆనంద్ మూడో సినిమాను ప్రకటించాడు విజయ్.

    ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న మూడో సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. దామోదర అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు 'పుష్పక విమానం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ద హిల్స్, టంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ బాషీ, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాన్వి మేఘన, గీత సైని హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, సునీల్, నరేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమాతో ముగ్గురు అమిత్ దాసాని, సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్లుగా పరిచయం అవుతున్నారు.

     Anand Deverakonda New Movie Pushpaka Vimanam

    'పుష్పక విమానం' సినిమా పోస్టర్‌ను నిర్మాతల్లో ఒకడైన విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం అతడు ముంబైలో చక్కర్లు కొడుతున్నాడు. అయినప్పటికీ తన తమ్ముడి సినిమానూ పర్యవేక్షించబోతున్నాడు.

    English summary
    Tollywood Young Hero Vijay Devarakonda Brother Anand, Senior Hero Rajashekar Daughter shivathmika acted Movie Dorasani. This Movie Running Successfully. This Film Directed By KVR Mahendra. Aanad Will Starts New Movie In Few Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X