యువ హీరో మెడపై రష్మిక మందన్న టాటూ..ఎందుకు వేసుకొన్నాడంటే?
బేబీ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్న యువ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేషా చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్మిక మందన్నను ఆనంద ఆటపట్టిస్తూ..
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న తన అందచందాలతో ఆకట్టుకొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఆనంద్ దేవరకొండ చిలిపి ప్రశ్నలతో ఆడుకొన్నారు. నీకు ఏ హీరో ఇష్టం అంటూ ఆనంద్ అడిగిన ప్రశ్నకు ఆమె సిగ్గుపడింది. అరే నీ యబ్బా అంటూ నన్ను ఇరికించావురా అంటూ నవ్వుల్లో మునిగింది.

అయితే ఆనంద్ నువ్వె ఎలాగైనా చెప్పాలి అంటూ.. నాకు పెద్ద రౌడీ అంటే ఇష్టం అని తన మనసులో మాట చెప్పేసింది. అయితే చిన్న రౌడీ ఇష్టం లేదా అని అడిగితే.. మళ్లీ నవ్వుల్లో మునిగిపోయింది. దాంతో చిన్న రౌడీ కూడా ఇష్టమని చెప్పు అంటూ బతిమిలాడితే.. నాకు చిన్న రౌడీ కూడా ఇష్టమని చెప్పింది.
ఇక తన మెడపై ఉన్న టాటూ ఏమిటో చెప్పమని అడిగితే.. రష్మిక చెప్పడానికి నిరాకరించింది. ఈ టాటూ ఎవరి కోసం వేయించుకొన్నానో చెప్పమని అంటే.. అది రష్మిక అంటూ ఆమె చెప్పింది. అది రష్మిక కాదు.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌తో నటించిన శ్రీవల్లి పేరు అంటూ ఆనంద్ ఓపెన్ అయ్యాడు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక ఎమోషనల్ అయింది. బేబీ సినిమా చూసిన తర్వాత నేను కంటతడి పెట్టుకొన్నాను. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నన్ను కదిలించాయి. ఎప్పటికైనా నాకు అవకాశం వస్తే.. దర్శకుడు రాజేష్ డైరెక్షన్‌లో నటించాలని ఉంది అని రష్మిక చెప్పింది. దాంతో రాజేశ్ కూడా ఎమోషనల్ అయ్యాడు.
గం..గం..గణేశా ఈ టీమ్ అందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మనకంటూ ఒకరి సపోర్ట్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నేను అది ఫీలయ్యాను. ఆనంద్ నాకు ఒక బ్రదర్. అతనికి తెలియదు అతని మీద నేను చాలా డిపెండ్ అవుతుంటా. ఈ సినిమా సక్సెస్ అందుకుంటే ఆనంద్ మొహంలో నవ్వు ఉంటుంది. ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నా.


Click it and Unblock the Notifications











