ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ ప్రీ లుక్
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రీ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ రాజు అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
1980 నాటి బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ మూవీలో ఆనంద్ దేవరకొండకు జంటగా రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక నటిస్తుంది. 'దొరసాని' ఫస్ట్ లుక్ మే 30న విడుదల చేయబోతున్నట్లు ఈ ప్రీ లుక్ ద్వారా ప్రకటించారు.

'పెళ్లి చూపులు' నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జులై 5వ తేదీన 'దొరసాని' రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తెలంగాణ విలేజ్ ప్రాంతానికి సంబంధించిన కథతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
షార్ట్ ఫిల్మ్ మేకర్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ఇద్దరూ నటనకు కొత్త కావడంతో సినిమా మొదలవ్వడానికి ముందే యాక్టింగ్ వర్క్ షాపులో శిక్షణ తీసుకున్నారు. సినిమా కథకు తగిన విధంగా తెలంగాణ స్లాంగ్, యాక్టింగ్ స్కిల్స్ ఇందులో నేర్పించారట. తన సోదరుడు హీరోగా పరిచయం కాబోతున్న మూవీ కావడంతో విజయ్ దేవరకొండ 'దొరసాని' ప్రమోషన్లలో కీలకంగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ మూడో వారం నుంచి 'దొరసాని' ప్రమోషన్స్ షురూ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











