జీవిత రాజశేఖర్ కూతురు కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఇక ఇంకెన్ని సంచలనాలో!
జీవిత రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక కూడా రంగం లోకి దిగేసింది. తల్లిదండ్రుల బాటలోనే తాను అందరి అభిమానం చూరగొంటానని వెండితెర బాట పట్టింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో జతకట్టి తన మొదటి సినిమా షూటింగ్ లో మంచి జోష్ తో పాల్గొంటోంది శివాత్మిక. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'దొరసాని' అనే ఓ క్యాచీ టైటిల్ పెట్టారు. టైటిల్ ని బట్టే ఈ సినిమాలో కొత్తదనం ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే అది నిజమే అని నిరూపించేలా ఉంది తాజాగా విడుదలైన 'దొరసాని' ఫస్ట్ లుక్ పోస్టర్. శివాత్మిక కారులో ప్రయాణిస్తుండగా.. సైకిల్‌పై ఆనంద్ ఆమెను ఫాలో అవుతున్నట్లుగా ఈ పోస్టర్ డిసైన్ చేశారు. ఇందులో శివాత్మిక లుక్‌ను చూస్తుంటే సినిమాను 1980 కాలం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయిన కేవీఆర్ మహేంద్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహేంద్ర ఇండస్ట్రీలో 17 ఏళ్లుగా ఉన్నప్పటికీ ఎంతో డిఫెరెంట్ గా ఈ 'దొరసారి' స్క్రిప్ట్‌ను తయారుచేయడానికి ఆయనకు ఐదేళ్ల సమయం పట్టిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

జూన్ 7 వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్లు ఈ ఫస్ట్ లుక్‌లోనే చెప్పేసింది చిత్ర యూనిట్. పాత కాలంనాటి టీనేజ్ రొమాన్స్‌ను, ఆ కాలంలో ఇద్దరు ప్రేమికులు సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందులను సినిమాలో చూపించనున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యశ్ రంగినేని, మధురా శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











