Tantra రక్త పిశాచాలు ఉన్నాయా? హారర్‌తో అనన్య నాగళ్ల, సలోని ‘తంత్ర’ డబుల్ డోస్!

ఫస్ట్ కాపీ మూవీస్, బీ ది వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై శ్రీనివాస్ గొపిశెట్టి దర్శకత్వంలో నరేష్ బాబు, రవి చైతన్య నిర్మిస్తున్న చిత్రం తంత్ర. యువ హీరోయిన్లు అనన్య నాగళ్ల, సలోని, నూతన హీరో ధనుష్ రఘుముద్రి, టెంపర్ వంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా టీజర్‌ను నటుడు ప్రియదర్శి ఆవిష్కరించారు. ఈ టీజర్ గురించిన వివరాల్లోకి వెళితే..

కాలగర్భంలో కలిసిపోయిన మన తాంత్రిక శాస్త్రాన్ని తెరిస్తే.. అందులో ఊహకి అందని రహస్యాలెన్నో అంటూ టీజర్‌ ఆరంభంలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అయితే టీజర్‌లో కనిపించిన హారర్ సన్నివేశాలు ఈ మూవీ డిఫరెంట్‌గా ఉండబోతుందనే ఫీల్ కల్పించింది. ఓ ఊరిలో దుష్టశక్తి పుడితే ఎలాంటి ఎలాంటి దుష్పరిమాణాలు తలెత్తుతాయనే విషయాన్ని స్పష్టంగా చూపించారు.

Ananya Nagalla and Salonis Tantra teaser looks promising with horror Elements

దుష్టశక్తి బారిన పడిన యువతి పాత్రలో యువ హీరోయిన్ అనన్య నాగళ్ల నటించారు. గతంలో సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించి.. ఇటీవల కాలంలో తెలుగు సినిమాకు దూరమైన సలోని మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఓ మిస్టిరియస్ పాత్రతో ఈ సినిమా ద్వారా సిద్దమయ్యారు. టెంపర్ వంశీ సరికొత్తగా కనిపించబోతున్నారనే విషయం టీజర్‌ చెప్పకనే చెప్పింది.

ఇక తంత్ర సినిమా ద్వారా ప్రముఖ నటుడు, స్వర్గీయ శ్రీహరి సోదరుడి కుమారుడు ధనుష్ రఘుముద్రి తెలుగు సినిమా రంగానికి పరిచయం కాబోతున్నాడు. ఇక మంగళవారం మూవీలో తనదైన శైలిలో కామెడీ పండించిన లక్ష్మణ్ మీసాల మరోసారి ఆకట్టుకొనే పాత్రలో నటించారని సినిమా యూనిట్ వెల్లడించింది.

Ananya Nagalla and Salonis Tantra teaser looks promising with horror Elements

తంత్ర మూవీ టీజర్ చూసిన ప్రియదర్శి ఈ సినిమాకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమా టీజర్‌ను ఆవిష్కరించిన తర్వాత.. సస్సెన్స్, థ్రిల్లర్, హారర్ జోనర్‌తో వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాక్షించారు. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

నటీనటులు, సాంకేతిక విభాగాల గురించి

నటీనటులు: అనన్య నాగళ్ల, సలోని, ధనుష్, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు
దర్శకత్వం: శ్రీనివాస్ గొపిశెట్టి
నిర్మాతలు: నరేష్ బాబు, రవి చైతన్య
సహా నిర్మాత: తేజ్ పల్లి
సినిమాటోగ్రఫి: సాయిరాం ఉదయ్, విజయ్ భాస్కర్ సద్దాల
ఎడిటింగ్: ఎస్‌బీ ఉద్దవ్
మ్యూజిక్: ఆర్ఆర్ ధ్రువన్
సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా, శ్యామలన్ సిక్దర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X