Anveshi Teaser Review: ఆత్మలు ఉన్నాయా? ఎవరి కోసం అన్వేషణ.. సైకాలజికల్ థ్రిల్లర్‌గా అన్వేషి!

నూతన నటుడు విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, అన‌న్య నాగ‌ళ్ల హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌తో కూడిన ప్రేమకథ అన్వేషి.అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వీజే ఖ‌న్నా ద‌ర్శ‌క‌త్వంలో టీ గ‌ణ‌ప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ ప్ర‌ముఖ నిర్మాత డీ సురేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

అజ‌య్ ఘోష్, నాగి, హ‌రికృష్ణ (గృహ ల‌క్ష్మి), ప్ర‌భు, దిల్ ర‌మేష్‌, చంద్ర శేఖ‌ర్ రెడ్డి, ర‌చ్చ ర‌వి, మిమిక్రీ సుబ్బ‌రావు, ఇమ్మాన్యుయేల్‌, జ‌బ‌ర్ద‌స్త్ స‌త్య త‌దితరులు నటిస్తున్నారు. ఈ టీజర్ ఎలా ఉంది? అసలు అన్వేషి సినిమా కథ ఏమిటి అనే విషయాల్లోకి వెళితే..

Ananya Nagallas Anveshi movie Teaser Review

డిటెక్టివ్ కావాలనుకొన్న యువకుడు: నాక్కూడ డిటెక్టివ్ కావాలని ఉంది అనే డైలాగ్‌తో అన్వేషి టీజర్ మొదలైంది.ఆ తర్వాత చిన్న లవ్ ట్రాక్‌ సీన్‌‌లో.. ఏంటి మీ అబ్బాయిలు. ఇలా పరిచయం కాగానే కాఫీ షాప్‌కు రమ్మంటారు అంటే.. కాఫీలో కెఫిన్ అనే మత్తు పదార్థం ఉంది. ఇద్దరు వ్యక్తులను కలిపే శక్తి ఉంది అని హీరో సమాధానం చెబుతాడు. కొనుక్కోవడం ఈజీ.. కనుక్కోవడం కష్టం అంటూ లాంటి డైలాగ్స్ టీజర్‌లో హైలెట్‌గా నిలిచాయి.

Ananya Nagallas Anveshi movie Teaser Review

ఆత్మలు ఉన్నాయా? అంటూ ప్రశ్న: అర్ధరాత్రి ప్రపంచానికి పది కిలోమీటర్ల దూరం విసిరేసినట్టు ఉండే మారెడుమిల్లి గ్రామానికి వెళ్లడంతో కథకు ట్విస్టు ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. స్వాములు, దెయ్యాల అంశాన్ని కథలోకి తెచ్చి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌గా మార్చారు. నిజంగా ఆత్మలు ఉన్నాయా? అంటూ ప్రశ్నను లేవనెత్తి టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచారు. ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్, సైమన్ కింగ్ బీజీఎం, కేకే రావు సినిమాటోగ్ర‌ఫి బలంగా కనిపించాయి.

Ananya Nagallas Anveshi movie Teaser Review

మైలురాయిగా నిలిచే సినిమాగా: అన్వేషి సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత టీ గణపతి రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాత‌గా అన్వేషి నా తొలి చిత్రం. ల‌వ్ అండ్ సైక‌లాజికల్ థ్రిల్ల‌ర్‌గా సినిమాను రూపొందించాం. మా దర్శకుడు అందించిన మంచి క‌థ‌, స్క్రీన్‌ప్లే ప్రేక్ష‌కుల‌ను సీటు చివర్లలో కూర్చోపెట్టి భయపెట్టే విధంగా ఉంటుంది. షూటింగ్ అంతా పూర్త‌య్యింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మా బ్యాన‌ర్‌లో మైలురాయిగా నిలిచే సినిమాగా అన్వేషి నిలుస్తుంది అని అన్నారు.

Ananya Nagallas Anveshi movie Teaser Review

నటీనటులు, సాంకేతిక నిపుణులు: విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, అన‌న్య నాగ‌ళ్ల‌, అజ‌య్ ఘోష్, నాగి, హ‌రికృష్ణ (గృహ ల‌క్ష్మి), ప్ర‌భు, దిల్ ర‌మేష్‌, చంద్ర శేఖ‌ర్ రెడ్డి, ర‌చ్చ ర‌వి, మిమిక్రీ సుబ్బ‌రావు, ఇమ్మాన్యుయేల్‌, జ‌బ‌ర్ద‌స్త్ స‌త్య త‌దితరులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:వీజే ఖ‌న్నా
నిర్మాత‌: టీ గ‌ణ‌ప‌తి రెడ్డి
కో ప్రొడ్యూస‌ర్స్‌: హరీష్ రాజు, శివ‌న్ కుమార్ కందుల‌, గొల్ల వెంక‌ట రాంబాబు, జాన్ బోయ‌ల‌ప‌ల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: దుర్గేష్ ఏ
బ్యాన‌ర్‌: అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్
సినిమాటోగ్రఫి:కేకే రావు
మ్యూజిక్‌: చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌
బీజీఎం: సైమ‌న్ కింగ్‌
ఎడిట‌ర్‌: కార్తీక శ్రీనివాస్‌
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
లిరిక్స్‌: చైత‌న్య ప్ర‌సాద్‌, చైత‌న్య వ‌ర్మ‌, శుభం విశ్వ‌నాథ్‌
స్టంట్స్‌: జాషువా
కొరియోగ్ర‌ఫీ: ప్రేమ్ ర‌క్షిత్‌, విద్యాసాగ‌ర్ రాజు
పీఆర్వో: వంశీ కాకా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X