Pottel Motion Poster Review గూస్‌బంప్స్ తెప్పించిన పొట్టేల్.. కేక పెట్టించిన మోషన్ పోస్టర్!

మంచి కంటెంట్‌తోపాటు మంచి నెటివిటీ ఉంటే సినిమాను ఆదరిస్తామని పలుమార్లు ప్రేక్షకులు నిరూపించారు. కాంతార, బలగం లాంటి కంటెంట్, ఎమోషన్స్ ప్రధానంగా సాగే సినిమాల మరో లెవెల్‌కు తీసుకెళ్లడమే కాకుండా కాసుల వర్షం కురిపించారు. అలాంటి కోవలోనే వస్తున్నట్టు అనిపిస్తున్న చిత్రం పొట్టేల్. పూర్తిగా గ్రామీణ నేపథ్యంగా రూపొందినట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

బంధం అనే ఇండిపెండెంట్ సినిమాతో దర్శకుడిగా మారిన సాహిత్ మోత్కూరి ఆ తర్వాత సవారీ అనే సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం పొట్టేల్.ఈ చిత్రంలో యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Ananya Nagallas Pottel Motion Poster Review: Joginis Bonalu moments goes viral

పొట్టేల్ సినిమాను ఎన్ఐఎస్ఏ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.


పోట్లేల్ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తే.. బోనాల పండుగను గుర్తు చేసిందనే చెప్పాలి. అమ్మవారి ముందు పొట్టేల్‌ను సంప్రదాయకంగా అలకరించి బలి ఇచ్చే ముందు జోగినిలు పాడే లయబద్దమైన పాటతో గూస్ బంప్స్ వచ్చేలా చేసింది. తెలంగాణ ప్రాంతంలోని ఆచారాలు మోషన్ పోస్టర్‌లో కనిపించాయి.

పొట్టేల్ మోషన్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిన సాంకేతిక విభాగం మ్యూజిక్. శేఖర్ చంద్ర మరోసారి తన మార్క్ మ్యూజిక్‌ను అందించారు. మనీష్ భూపతిరాజు సినిమాటోగ్రఫిని, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X