తండ్రిపై "లైగర్" బ్యూటీ షాకింగ్ ఆరోపణలు.. ఆ తప్పు చేసాడు అంటూ.. వార్నింగ్ కూడా ఇచ్చిందట

ఇప్పుడు నార్త్ , సౌత్ అని కాకుండా ఇండియన్ సినిమాగా మారిపోయిన సంగతి తెలిసిందే. పలు సినిమాలు సరిహద్దులు బద్దలుకొట్టడంతో ఒకో భాషకి చెందిన నటీనటులు, దర్శకులు ఒకరితో ఒకరు కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా పలువురు హీరోయిన్స్ సౌత్ నుంచి నార్త్‌కి... నార్త్ నుంచి సౌత్‌కి చక్కర్లు కొడుతున్నారు.

వీరిలో కొందరు సక్సెస్ అయ్యినవాళ్లు ఉన్నారు అలాగే ఇంకొందరు తమ మొదటి సినిమా తోనే డిజాస్టర్ అందుకున్న వారు కూడా ఉన్నారు. ఇపుడు ఈ రెండో టైప్ హీరోయిన్ గురించే మాట్లాడుకుందాం. బాలీవుడ్ నుంచి తెలుగు దర్శకులతో వర్క్ చేసిన హీరోయిన్స్‌లో యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ అనన్య పాండే ఒకరు.

ananya panday shocking comments on her father on liger failure

అనన్య పాండే తెలుగులో భారీ సినిమా తోనే డెబ్యూ ఇచ్చింది. అప్పటికే తెలుగు యువతలో పాగా వేసిన యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా.. దర్శకుడు పూరి జగన్నాథ్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో హీరోయిన్ గా చేసే ఛాన్స్ ని ఈ అమ్మడు కొట్టేసింది. ఇక పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్స్ అంటే ఎలా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇలా ఈ కాంబో నుంచి వచ్చిన సినిమానే "లైగర్". ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమాలో మేటర్ లేకపోయేసరికి భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అనన్య చాలా బాధ పడిందట. అసలు ఈ సినిమా విషయంలో తనకి మెయిన్ విలన్ ఎవరైనా ఉన్నారు అంటే అది తన తండ్రి చుంకి పాండే అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ లైగర్ డిజప్పాయింట్మెంట్‌కు పూర్తి కారణం తన తండ్రే అని వాపోయింది. ఈ సినిమా తాను ఓకే చెయ్యడానికి కారణం తన తండ్రే అని ఆయన ఫోర్స్ చేస్తేనే లైగర్ ఓకే చేశానని అనన్య చెప్పుకొచ్చింది.

ananya panday shocking comments on her father on liger failure

తీరా ఆ సినిమా ప్లాప్ అయ్యేసరికి చాలా బాధ పడ్డానని .. ఆ తర్వాత నా కెరీర్ పరంగా ఎలాంటి సలహాలు ఇవ్వక్కర్లేదు అని అనన్య పాండే తన తండ్రికి తెగేసి చెప్పేసిందట. ఇలా లైగర్ ప్లాప్ అయినందు కంటే ఆ సినిమాని చేయమని చెప్పిన వాళ్ళ నాన్న మీదే ఆమెకు చాలా కోపంగా ఉందట.

కాగా అనన్య తండ్రి చుంకి పాండే కూడా నటుడే. హిందీలో ఆయన పలు హిట్ చిత్రాల్లో నటించారు. అలాగే తెలుగులో కూడా చుంకి ఓ భారీ సినిమా చేశారు. ఆ సినిమా ఏదో కాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ సినిమా "సాహో" నే. ఈ సినిమాలో చుంకి మెయిన్ విలన్ రోల్ లో నటించారు. ఇది ఆయనకి తెలుగులో మొదటి సినిమా కాగా ఇంట్రెస్టింగ్ గా తన కూతురు లానే తాను కూడా తెలుగులో తొలి చిత్రంతోనే ఫ్లాప్ ఎదుర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X