నా బలమే అది.. అలా అయితేనే చేస్తా.. హాట్ యాంకర్ అనసూయ
బుల్లితెర యాంకర్ గా మొదలైన అనసూయ ప్రస్థానం అంచెలంచెలుగా ముందుకెళ్లి వెండితెర గ్లామర్‌గా మారింది. జబర్దస్త్ షోతో బుల్లితెరపై బాగా పాపులర్ అయిన ఈ హాట్ భామ ఆ తర్వాత వెండితెరపై కూడా అంతే పాపులారిటీ తెచ్చుకుంది. విలక్షణ పాత్రలు, గ్లామర్ పాత్రలు, సప్పోరింగ్ రోల్స్ ఇలా ఏవైనా చేయగలను అని అనతి కాలంలోనే నిరూపించుకుంది అనసూయ. దీంతో ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుత పరిణామాలకు తగ్గట్టుగా ఆమె గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా అందరితో టచ్ లో ఉండటం ఈమెలోని మరో ప్రత్యేకత. కాగా తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్.. దాని అర్థం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
ఎల్లప్పుడూ గ్లామర్ ఫొటోలేనా.. కొన్ని సందర్భాల్లో ఇలా కూడా ఆకట్టుకుందాం అన్నట్లుగా అనసూయ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఎలాంటి హాట్ నెస్ లేదు.. అయినా కూడా వైరల్ అవుతోంది. కారణం ఏంటంటారా..? అలా సరదాగా స్మైలింగ్ పేస్ తో దిగిన తన పిక్ షేర్ చేసిన అనసూయ దానికి తాను నమ్మిందే చేస్తానని, అదే తన బలమని కాప్షన్ పెట్టడం. కొందరు హీరోయిన్లు ట్రెండ్ అంటూ ఫోజులు కొడుతూ సెక్సీ లుక్స్ మాత్రమే పోస్ట్ ఈ రోజుల్లో ఇలా మేల్కొలిపే మెసేజ్‌తో అనసూయ ఆకట్టుకోవడం హర్షించదగిన విషయమే కదండీ.

ఇక అనసూయ సినిమా సంగతి చూస్తే.. సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నాగార్జునతో, రంగస్థలంలో రంగమ్మత్తగా రామ్ చరణ్ తో కలిసి తెగ అట్రాక్ట్ చేసిన ఈ భామ ఆ తర్వాత వరుసగా ఎఫ్ 2, యాత్ర సినిమాలతో కట్టిపడేసింది. దీంతో అనసూయకు కూడా సొంత అభిమాన వర్గం ఏర్పడింది. ప్రస్తుతం ఈమె చేస్తున్న కొత్త సినిమా కథనం. ఈ చిత్రంలో అనసూయదే లీడ్ రోల్. దీనిపై భారీగా ఆశలు పెట్టుకుంది అనసూయ. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











