నా బాడీ నా ఇష్టం.. శివాజీకి అనసూయ దిమ్మతిరిగే కౌంటర్?

అనసూయ భరద్వాజ్.. పరిచయం అక్కర్లేని పేరు. సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి సెలబ్రిటీగా మారిపోయారు. అందం, అభినయం కలగలిసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనసూయకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఫుల్ డిమాండ్ ఉంది. అయితే ఆమెకు నటిగా ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అదే స్థాయిలో విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు అనసూయ. కానీ వీటిని అదే స్థాయిలో స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తుంటారు అనసూయ. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు
సోషల్ మీడియాలో లైవ్ ఛాట్స్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటారు అనసూయ. ఈ సమయంలో ఎవరైనా నోరుజారితే అప్పటికప్పుడే లెఫ్ట్ రైట్ ఇచ్చిపడేస్తారు. అలాగే తనను ఆంటీ అని పిలవొద్దని పలుమార్లు క్లాస్ పీకారు కూడా. చిన్నపిల్లలు ఆంటీ అని పిలిచే పిలుపులో ఒక ప్రేమ, ఆప్యాయత ఉంటాయని.. కానీ పురుషులు పిలిచే పదంలో అర్ధం వేరే ఉంటుందని దానికి అనసూయ వివరణ కూడా ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, ట్రోలింగ్‌పై సీరియస్ అయిన అనసూయ.. గతంలో దీనిపై పోలీసులను సైతం ఆశ్రయించారు.

Anasuya Bharadwaj befitting reply to Sivaji s comments on Women Dressing at Dhandoraa Pre Release event

నిధి అగర్వాల్‌తో అసభ్య ప్రవర్తన
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో ది రాజా సాబ్ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ జరగ్గా.. చిత్ర యూనిట్ సందడి చేసింది. ఆ సమయంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పలువురు అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం వంటి పనులతో ఇబ్బంది పెట్టారు. అతి కష్టం మీద ఆమెను కారెక్కించారు నిర్వాహకులు. ఈ ఫోటోను షేర్ చేసిన ఓ నెటిజన్.. నిధి మాదిరిగానే, అనసూయను చేయాలన్న అర్ధం వచ్చేలా కామెంట్ చేశాడు. దీనిపై స్టార్ యాంకర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసలు ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? ఆ రోజు నిధి అగర్వాల్ గారి పరిస్థితికి నాకే జాలి వేసింది. పోలీసులు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలని అనసూయ కోరారు.

అనసూయ డ్రెస్సింగ్ స్టైల్‌పై విమర్శలు
గతంలో అనసూయ ధరించే దుస్తులపై ఓ సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన అనసూయ తన దుస్తుల ఎంపిక తన వ్యక్తిగతమైన విషయమని, ఎంతో అనుభవం ఉన్న నటుడు ఇలా మాట్లాడటం దౌర్భాగ్యమని అనసూయ వ్యాఖ్యానించారు. తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు అనసూయ భరద్వాజ్. వీటిలో కొన్ని సాంప్రదాయమైన దుస్తులతో పాటు మోడ్రన్ డ్రెస్సులు కూడా ఉంటాయి. వీటిని అడ్డుపెట్టుకుని ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తుంటారు. చాలా వరకు అనసూయ వాటిని పట్టించుకోకూడదని సంయమనం పాటిస్తుంటారు. కానీ నెటిజన్లు హద్దు మీరుతుండటంతో ఆమె సీరియస్ అవ్వడం అది కాస్తా వివాదంగా మారడం జరుగుతోంది.

నా బాడీ నా ఇష్టమంటై అనసూయ పోస్ట్
తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అది నా బాడీ.. మీది కాదు అనే అర్ధం వచ్చేలా ఓ పోస్ట్ పెట్టడం కలకలం రేపుతోంది. సరిగ్గా కొద్దిగంటల క్రితం హీరోయిన్లు, ఇతర మహిళా నటుల డ్రెస్సింగ్ స్టైల్‌పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న దశలో అనసూయ ఇలాంటి పోస్ పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. శివాజీ పేరెత్తకుండా అనసూయ ఇలా కౌంటర్ వేశారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే శివాజీ గారు 100 శాతం కరెక్ట్... శివాజీ సార్ చెప్పింది నిజమే, తన మనసులో ఏముందో ఆయన డైరెక్ట్‌గా చెప్పారు. మీరూ డైరెక్ట్‌గా మెన్షన్ చేసి అనొచ్చు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై అనసూయ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X