క్షమించండి అంటూ బూతులు మాట్లాడిన అనసూయ.. అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో జరిగిన దిశా హత్య ఘటన చూసి దేశమంతా ఉలిక్కిపడింది. నలుగురు వ్యక్తులు కలిసి ఓ మహిళా వెటర్నరీ డాక్టర్‌ని హత్య చేసిన ఈ ఘటన కలకలం సృష్టించింది. దీంతో ఆ నలుగురినీ కఠినంగా శిక్షించాలని దేశమంతా గొంతెత్తి అరుస్తోంది. పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటనపై అనసూయ స్పందించకపోవడంపై పలువురు నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది చూసి స్వయంగా ఓ వీడియో ద్వారా నెటిజన్లపై ఫైర్ అవుతూ ఆవేదన చెందింది అనసూయ. వివరాల్లోకి పోతే..

ఫైర్ అయిన అనసూయ.. తీవ్ర ఆవేదన
దిశా ఘటనపై తాను స్పందించకపోవటానికి కారణం చెబుతూ దేశంలో మహిళల పరిస్థితి తలచుకుంటూ తీవ్ర ఆవేదన చెందింది అనసూయ. ఈ మేరకు దిశా ఘటనపై కొందరు నెటిజన్లు పెట్టిన కామెంట్స్ చదివి వినిపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ. ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Recommended Video

వల్గర్ కామెంట్లు.. స్వయంగా చదివి వినిపించిన అనసూయ
దిశా ఘటనపై స్పందిస్తూ కొందరు నెటిజన్లు చెప్పుకోలేని పదాలతో కామెంట్లు చేశారు. దిశా కేసులో హత్యకు గురైన మహిళదే తప్పు అన్నట్లుగా కామెంట్లు పోస్ట్ చేస్తూ బయటకు చెప్పలేని భాష ఉపయోగించారు. ఈ కామెంట్లు చదువుతున్నందుకు క్షమించండి అని చెబుతూ.. నెటిజన్స్ చేసిన కామెంట్స్ అన్నీ చదివి వినిపించింది అనసూయ.

మా డ్రెస్సులు, జీవన విధానాల గురించి మాట్లాడానికి మీకున్న హాక్కేంటి?
అమ్మాయిల జీవితాలను డిసైడ్ చేయటానికి మీరెవరు? మా డ్రెస్సులు, జీవన విధానాల గురించి మాట్లాడానికి మీకున్న హాక్కేంటి? అంటూ ఫైర్ అయింది అనసూయ. మీకంటూ ఓ అమ్మాయి ఎక్కడో చోట పుట్టే ఉంటుంది.. ఆ అమ్మాయి పైనే ఈ కా** వాంఛ చూపించండి. అది కూడా ఆ అమ్మాయి పర్మిషన్ తోనేరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఉచ్చ పడుతుంది.. నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్
ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ట్రోల్స్, ఓ జాతీయ మీడియా రాసిన కథనంపై కూడా స్పందిస్తూ ఓ రేంజ్ కామెంట్లు చేసింది అనసూయ. ఇదంతా చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయింది. నేను ఎదురుగా ఉంటే మీకు ఉచ్చ పడుతుంది అంటూ తనపై ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ వేసింది అనసూయ.

కేర్ ఫుల్‌గా ఉన్నా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు
గతంలో ఎన్నో ఇలాంటి సంఘటనలు జరిగాయి. కానీ ఎవరికైనా సరైన శిక్ష పడిందా? తాము ఎంత కేర్ ఫుల్‌గా ఉన్నా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు.దిశా ఘటనలో నిందితులైన ఆ నలుగురు వాళ్ళ లైఫ్ పాడు చేసుకున్నారు. ఆ అమ్మాయి లైఫ్ పాడు చేశారు. వీటన్నింటికీ ఇంట్లో నుంచే పరిష్కారం మొదలు కావాలి. ప్రతీ ఇంట్లో అమ్మాయిలను ఎలా గౌరవించాలో తల్లిదండ్రులు నేర్పించాలి అని అనసూయ పేర్కొంది.

అంగాంగ ప్రదర్శన చేస్తున్నానని, నా షో ప్రమోట్ చేసుకుంటున్నానని
దిశా ఘటనపై నేను స్పందించకుండా అంగాంగ ప్రదర్శన చేస్తున్నానని, నా షో ప్రమోట్ చేసుకుంటున్నానని వార్త రాశారు. ఏంటి? మీరు మీ పనులకు వెళ్లడం లేదా? అలాగే నా పని నేను చేసుకుంటున్నాను. నా లివింగ్ స్టైల్ నాది. ముందు ఎంటర్‌టైన్‌మెంట్‌కి, రియల్ లైఫ్‌కి తేడా తెలుసుకోండి అంటూ ఫైర్ అయింది అనసూయ.

ముందు మీ లిమిట్స్ మీరు తెలుసుకోండి
ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతుకుతున్నందుకు సిగ్గుగా ఉందని అనసూయ తెలిపింది. అమ్మాయిలకు సలహాలు ఇవ్వడం కాదు.. ముందు మీ లిమిట్స్ మీరు తెలుసుకోండి అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది. తనపై వల్గర్ కామెంట్ చేసిన ఓ నెటిజన్ పై ఫైర్ అవుతూ నీ బతుకు నాశనం చేస్తా.. నీకంటే నాకు ఎక్కువ బూతులు వచ్చు. బీ కేర్ ఫుల్ అని వార్నింగ్ ఇచ్చింది అనసూయ.


Click it and Unblock the Notifications











