twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anasuya Bharadwaj: అన్నంత పని చేసిన అనసూయ.. వాళ్ళపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

    |

    టెలివిజన్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల సోషల్ మీడియాలో స్పందించిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. లైగర్ రిజల్ట్ ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఊహించని విధంగా వైరల్ అయ్యాయి. అయితే అనసూయ ట్వీట్ పై జద్దులు దాటి స్పందించిన నెటిజన్లకు ఆమె ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రిప్లై అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి అనసూయ తనపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

    అలా చేసిన కామెంట్స్

    అలా చేసిన కామెంట్స్

    టెలివిజన్ యాంకర్ గా సినీనటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా కనిపిస్తూ ఉంటారు. పలు అంశాలపై కూడా స్పందించే విధానం వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇక రీసెంట్ గా విజయ్ అర్జున్ రెడ్డి టైమ్ లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా లైగర్ సినిమా రిజల్ట్ పై ఆమె చేసిన కామెంట్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను షాక్ కు గురి చేశాయి.

    ఉసురు ఊరికే పోదు..

    ఉసురు ఊరికే పోదు..

    అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!.. అంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్లో ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. అయితే ఆ విషయం స్పందించిన కొందరు ఎప్పుడూ జరిగిపోయిన గొడవలు ఇప్పుడు ఎందుకు హైలెట్ చేయడమంటూ అనసూయా ట్వీట్ పై తీవ్రస్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

    అనసూయ హెచ్చరికలు

    అనసూయ హెచ్చరికలు

    ఇక అనసూయ చేసిన ట్వీట్ పై మరికొందరు చాలా ఘాటుగా స్పందించడం కూడా ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా ఆంటీ అనే పదాన్ని కూడా ఏమాత్రం ఒప్పుకోలేదు. మరోసారి ఆంటీ అంటే తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటాను అని కూడా ఆమె పలుమార్లు హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగలేదు. బాడీ షేవింగ్ చేయడం ఏమాత్రం తగ్గలేదు అని అనసూయ పేర్కొన్నారు.

    సైబర్ క్రైమ్ లో పిర్యాదు

    సైబర్ క్రైమ్ లో పిర్యాదు


    ఇక మొత్తానికి అనసూయ తన సహనాన్ని కోల్పోయి ఇప్పుడు అన్నంత పని చేయక తప్పలేదు అని మరో వివరణ ఇచ్చారు. ఇన్ని రోజులు ఏమైనా మారతారేమో అని ఎదురు చూశాను కానీ అసభ్యకరమైన పదజాలంతో బాడీ షేమింగ్ చేస్తున్న వారు ఏమాత్రం మారలేదు. అందుకే ఇప్పుడు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయడం తప్పడం లేదు అని అన్నారు.

    ఫిర్యాదు చేయక తప్పలేదు

    ఫిర్యాదు చేయక తప్పలేదు

    ఆన్ లైన్ లో కించపరిచే విధంగా అబ్యూజింగ్‌ కామెంట్స్ పెట్టకూడదు అని ఎంతగానో మొత్తుకుంటున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు అనుకున్నట్లు ప్రక్రియ మొదలైంది. ఇన్ని రోజులు యువకుల భవిష్యత్తు కోసం ఆలోచించి చాలా సమయం ఆగాను. కానీ ఇది మొత్తానికి జరిగింది. ఫిర్యాదు చేయక తప్పలేదు. వెంటనే మద్దతు ఇచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు కూడా తీసుకుంటాము అని అన్నారు.. అని అనసూయ ట్వీట్ లో తెలియజేశారు.

    English summary
    Anasuya Bharadwaj filed cyber crime case on online abusing
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X