Anasuya Bharadwaj ఫైనల్ వార్నింగ్.. అలా అంటే చర్యలు తప్పవు.. అస్సలు వదిలిపెట్టను అంటూ సీరియస్!

లైగర్ సినిమా విడుదలైన రోజు అనసూయ చేసిన ట్వీట్ ఒక్కసారిగా వివాదాస్పదంగా మారిపోయింది. విజయ్ దేవరకొండ అభిమానులు అందరూ కూడా అనసూయపై వివిధ రకాలుగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా గతంలోనే కామెడీ షోలకు సంబంధించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా షేర్ చేస్తూ కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫైనల్ వార్నింగ్ అంటూ ఆమె చేసిన మరొక ట్వీట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఆమె వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ విషయంపై తదితరులు కౌంటర్ గా స్పందిస్తూ ఉండడం.. విశేషం పూర్తి వివరాల్లోకి వెళితే..

మరింత వివాదం

మరింత వివాదం

అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ తల్లిని తిట్టడం జనాలందరి చేత కూడా అనిపిస్తున్నాడు అని అనసూయ తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమె న్యూస్ చానల్స్ లో కూడా డిబేట్లో కూర్చొని ఇలాంటి మాటలు ఎందుకు అంటారు అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే అప్పుడు కూడా విజయ్ అభిమానులు కౌంటర్ ఇవ్వగా.. ఇప్పుడు అనసూయ లైగర్ సినిమా రిసల్ట్ పై పరోక్షంగా స్పందిస్తూ కర్మ ఎప్పటికైనా మారదు అని తల్లిని తిట్టిన పాపం ఎన్నటికీ పొదని సంచలన ట్వీట్ చేయడం మరింత వివాదానికి దారితీసింది.

అనసూయ కౌంటర్స్

అనసూయ కౌంటర్స్


సోషల్ మీడియాలో మరి దారుణంగా కామెంట్ చేస్తున్నారు అని ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదు అని ఆమె ప్రతి ఒక్కరికి కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అంతే కాకుండా తప్పుగా నిందిస్తూ కామెంట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా తాను సిద్ధమే అని అనసూయ సీరియస్ గా స్పందించింది. తప్పకుండా తనపై నిందలు వేసిన వారికి తగిన మూల్యం చెల్లించుకుంటారు అంటూ తప్పకుండా నేను ఆ దిశగా ప్రయత్నం చేస్తాను అని కూడా ఆమె తెలియజేశారు.

డబ్బులు ఇచ్చి..

డబ్బులు ఇచ్చి..

ఇండస్ట్రీలో ఉండే ఒక సినిమా ఫ్లాప్ అయితే దాన్ని నువ్వు సెలబ్రేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మళ్లీ నీతులు చెబుతున్నావు అని మరొకరు స్పందించగా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చి ఒక ఉమెన్ ని అలాగే తల్లిని తోటి యాక్టర్ పై కూడా దారుణంగా కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అనసూయ ప్రశ్నించింది. నా ప్లేస్ లో ఉంటే మీరు ఎన్నేళ్ళయినా మర్చిపోగలరా క్షమించగలరా అని అనసూయ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఫైనల్ వార్నింగ్

అనసూయ నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ కు ఇప్పుడు హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. "ఛీ ఛీ!! అస్సలు ఎంత చెత్త.. బాబోయ్.. క్లీన్ చేసి విసుగొస్తుంది" అని ఈరోజు ట్వీట్ చేసిన ఆమె, ఆ తర్వాత దుర్వినియోగం చేసిన వారందరిపైనా చర్యలు తీసుకుంటానని చెప్పారు. "ఇదిగో..నన్ను దుర్భాషలాడిన ప్రతి అకౌంట్ స్క్రీన్‌షాట్ తీస్తున్నా.."ఆంటీ" అని పిలవడం ద్వారా నాకు వయసును అవమానించడం..దీనిలో మా కుటుంబాన్ని ప్రమేయం చేయడం లాంటిదే.. నేను కేసు ఫైల్ చేసి, మీరు ఏమీ లేకుండా నా దగ్గరికి వచ్చినందుకు చింతించే స్థాయికి తీసుకెళ్తాను. చట్టబద్ధమైన చర్యలు తప్పవు..ఇది నా ఆఖరి హెచ్చరిక".. అంటూ అనసూయ కౌంటర్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X