రంగమ్మత్తకు అత్యుత్తమ ప్రశంస.. గాల్లో తేలిపోతున్న అనసూయ
మెగా పవర్‌స్టార్ రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలంతో అనసూయ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న గ్లామరస్ ఇమేజ్‌తోపాటు ఫెర్ఫార్మర్‌గా మంచి మార్కులు కొట్టేసింది అనసూయ. ఆ తర్వాత ఆమెను రంగమ్మత్తగా పిలవడం మొదలైంది. రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి పేరు, అభిమానులను సంపాదించిపెట్టిందనేది వాస్తవం. అయితే అలాంటి సంఘటన మరోసారి రుజువైంది.
తాజాగా లాక్‌డౌన్ సమయంలో #askAnasuya అంటూ అనసూయ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని మంచి కామెంట్ చేశాడు. అనసూయ గారు.. ఇప్పటి వరకు సినీ తారల్లో ఎవరినీ మా అమ్మ ఇష్టపడదు. కనీసం సినిమాలు కూడా ఎక్కువగా చూడదు. కాకపోతే రంగస్థలంలో రంగమ్మత్త రోల్‌లో మిమ్మల్ని చూసిన తర్వాత మీకు అభిమానిగా మారిపోయారు. అంతకంటే మీకు ఇంకా ఏమైనా ఉత్తమ ప్రశంస ఉంటుందా అనే విధంగా నెటిజన్ సందేశాన్ని పంపారు.

నెటిజన్ తన తల్లి గురించి తెలిపిన తర్వాత అనసూయ సంతోషంలో మునిగిపోయారు. హేయ్ అంటూ ఆనందంలో మునిగిపోయారు. మీ అమ్మగారికి నా ధన్యవాదాలు. గొప్ప అభిమానిని పొందినందుకు సంతోషంగా ఉంది అని అనసూయ ట్వీట్ చేశారు.
రంగస్థలం సినిమా తర్వాత అనసూయను మంచి పాత్రలు పలకరిస్తున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించే చిత్రంలోను, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో రూపొందిస్తున్న పుష్ప చిత్రంలో కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











