నవ్వుతోనే చంపేస్తున్న రంగమ్మత్త.. వాటిపై ఫోకస్ చేస్తూ.. ఫోటో షూట్‌ హల్ చల్

జబర్ధస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తెలుగు యాంకర్స్‌లో అంతటి అందం, ప్రతిభ ఉన్న వారిలో అనసూయే టాప్. ఆడజాతికి అసూయ పుట్టే అందం అనసూయ సొంతం. జబర్దస్త్ ప్రారంభ రోజుల్లో కేవలం తన గ్లామర్‌తోనే షోపై హైప్‌ను క్రియేట్ చేసింది. కేవలం తన గ్లామర్ బుల్లితెరకే పరిమితం అనుకుంటే పొరబాటే.. వెండితెరపైనా నటించి కంటతడి పెట్టించే ప్రతిభ ఉన్న నటి అనసూయ.

 హాట్ యాంకర్‌గా హల్ చల్..

హాట్ యాంకర్‌గా హల్ చల్..

న్యూస్ రీడర్‌గా మొదలైన అనసూయ కెరీర్.. వెండితెరపై మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే వరకు సాగింది. బుల్లితెర అనసూయ అమాంతం ఆకాశానికెత్తగా.. వెండితెర ఆమెలోని నటనా కౌశలాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. జబర్దస్త్ షో, ఇతర కార్యక్రమాల్లో హాట్‌గా కనిపిస్తూ ఎందరి గుండెల్లోనో చిచ్చు రేపింది.

 వెండితెరపై నటిగా..

వెండితెరపై నటిగా..

క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా, యాత్ర లాంటి చిత్రాలు అనసూయ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వీటన్నిటినీ మించి రంగస్థలంలోని రంగమ్మత్తగా ఆమెకు వచ్చిన పాపులారిటీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ మధ్య వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం కథనం ఆశించిన మేర విజయం సాధించలేకపోయినా.. నటిగా మంచి మార్కులే కొట్టేసింది.

Recommended Video

Anasuya Bharadwaj's Hot Photo Shoots Goes Viral ||
 క్షణం తీరిక లేకుండా..

క్షణం తీరిక లేకుండా..

ప్రస్తుతమున్న యాంకర్లలో క్షణం తీరిక లేకుండా గడిపేది అనసూయేనేమో అన్న అనుమానం కలుగుతోంది. ఓవైపు జబర్ధస్త్.. మరోవైపు జీటీవీ రియాలిటీ కార్యక్రమాలు.. ఇంకోవైపు సినిమాలు.. ఇలా బిజీ షెడ్యూల్‌తో రెండు చేతులా సంపాదిస్తోంది. ఇదంతా ఒకెత్తు అనుకుంటే సోషల్ మీడియాలో అనసూయ చేసే దాడి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.

హాట్ ఫోటో షూట్‌లతో హల్ చల్..

హాట్ ఫోటో షూట్‌లతో హల్ చల్..

లేటెస్టుగా అనసూయ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ నడుము అందాలను కనిపించి కనిపించనట్టు చూపిస్తూ చేసిన ఫోటో షూట్ అదిరిపోయింది.నవ్వుతూ కవ్విస్తూనే.. రకరకాల పోజులతో రంగమ్మత్త పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం అనసూయ రంగమార్తాండ చిత్రంలో నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X