ఫెరారీ పవర్ ఇంజిన్.. కాక రేపుతున్న రంగమ్మత్త
బుల్లితెరకు కొత్త అందం తేవడంలో హాట్ బ్యూటీ అనసూయదే పైచేయి అందంలో అతిశయోక్తి లేదు. గ్లామర్ లుక్స్‌తో అట్రాక్ట్ చేయడం కేవలం వెండితెరనే కాదు బుల్లితెరపై కూడా సాధ్యమే అని నిరూపించింది యాంకర్ అనసూయ. జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఈ హాట్ భామకు అందాలతో మాయ చేయడం వెన్నతో పెట్టిన విద్య. 35 ఏళ్ళు పైబడినా వయసు తెలియనీయకుండా ఎప్పుడూ హాట్ లుక్ లోనే కనిపిస్తుంటుంది. రకరకాల ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
ప్రస్తుతం అనసూయ అమెరికాలోని న్యూ జెర్సీలో షికారు చేస్తోంది. అక్కడ ఒక ఫోటో షూట్ లో పాల్గొన్న ఆమె నెటిజన్లను ఆకట్టుకుంది. డార్క్ కలర్ స్పోర్ట్స్ కారు వద్ద స్టైలిష్ గా ఫోటోకి ఫోజిచ్చింది అనసూయ. దీన్ని బ్యాట్ మొబైల్ కార్ అంటారు. 1989 లో రిలీజ్ అయిన 'బ్యాట్ మాన్' చిత్రంలో ఈ మోడల్ కారును వాడడం జరిగింది. ఎంతో స్పెషాలిటీ ఉంది కాబట్టే రంగమ్మత్త ఆ కారుతో ఫోటోలు దిగింది. ఈ పిక్స్ ని నెటిజన్లతో పంచుకున్న అనసూయ.. తను ధరించిన డ్రెస్సు 'రా సిల్క్ సూట్ డ్రెస్' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫెరారీ పవర్ ఇంజిన్, కాక రేపుతున్న రంగమ్మత్త అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే.. 'రంగస్థలం' సినిమాతో మంచి నటిగా గుర్తింపు పొందిన ఈమె మరికొద్ది రోజుల్లో 'కథనం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో రానున్న కొత్త సినిమాలో అనసూయ ముఖ్యపాత్ర పోషించనుందని టాక్.


Click it and Unblock the Notifications











