For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ క్రేజ్ ఇంకెక్కడా చూడలేదు.. ఫీలయినా చాలు.. స్టార్ హీరో గురించి అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు!

  |

  తెలుగులో యాంకరింగ్ కు కొత్త నిర్వచనం చెప్పిన అనసూయ ఇప్పుడు తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది. అప్పటిదాకా యాంకర్లు అంటే పద్ధతిగా చీర కట్టుకుని ఉండాలి అంటూ ఉన్న రూల్స్ ని బ్రేక్ చేసి మూడు పదుల వయసు దాటినా కుర్రాళ్లను ఆకట్టుకునే విధంగా హాట్ హాట్ డ్రెస్సులు వేసుకుంటూ ఆమె ఫాలోయింగ్ సంపాదించింది. తాజాగా ఆమె ఒక స్టార్ హీరోని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

  ఎన్టీఆర్ సినిమాలో మెరిసి

  ఎన్టీఆర్ సినిమాలో మెరిసి

  సినిమాల మీద ఆసక్తితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనసూయ కేవలం ఒక్క సినిమాకే పరిమితం అయిపోయింది. ఎన్టీఆర్ సినిమా నాగాలో చిన్న పాత్ర చేసిన ఆమె ఆ తర్వాత మళ్ళీ చదువు మీద ఆసక్తితో సినిమాలు జోలికి వెళ్ళలేదు. ఆ తర్వాత సాక్షిలో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె చివరికి జబర్దస్త్ షోలో అవకాశం దక్కించుకుంది.

   జబర్దస్త్ గా

  జబర్దస్త్ గా

  ఒకరకంగా జబర్దస్త్ షో ఆమె జీవితాన్ని ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. ఈ షో ద్వారా ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అందరూ ప్రజలకు పరిచయమైంది. అప్పటిదాకా యాంకరింగ్ అంటే కేవలం చీరకట్టుతో సంప్రదాయంగా నడుస్తున్న ధోరణికి అడ్డుకట్ట వేస్తూ యాంకర్లు హాట్ డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు అని నిరూపించింది. అలా కుర్రకారులో యమ క్రేజ్ సంపాదించుకుంది ఈ హాట్ యాంకర్.

  నాగార్జున మరదలి పాత్రలో

  నాగార్జున మరదలి పాత్రలో

  జబర్దస్త్ లో విపరీతమైన క్రేజ్ లభించడంతో ఈమెను సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధమైంది. ముందుగా ఈమెను అత్తారింటికి దారేది సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయమని కోరారు. అయితే తాను కేవలం సింగిల్ గా మాత్రమే చేస్తానని మరో ఇద్దరితో కలిసి చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ సాంగ్ చేయనని ఆమె తిరస్కరించింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో నటించి కేవలం రెండు నిమిషాల పాత్ర అయినా అందరినీ ఆకట్టుకుంది.

  రంగమ్మత్తగా

  రంగమ్మత్తగా

  ఇక ఆమె కెరీర్ ను మార్చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది రంగస్థలం అని చెప్పక తప్పదు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఆ తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఈమెను లీడ్ రోల్ లో పెట్టుకుని కూడా కొందరు సినిమాలు రాసుకున్నారు. అలా కథనం అనే సినిమా చేయగా అది నిరాశపరిచింది.

  పవన్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  పవన్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  ఇక సినిమాలు చేస్తూనే బుల్లితెర మీద కూడా బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న వ్యక్తిని ఈరోజుల్లో ఎవరిని చూడలేదు అని చెప్పుకొచ్చింది. అసలు ఆయన క్రేజ్ చూస్తుంటేనే ఒళ్ళు పులకించిపోయిన భావన కలుగుతుందని ఇక ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తే దాని కంటే అదృష్టం ఏముంటుందని ఆమె చెప్పుకొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆమె గొప్పగా మాట్లాడడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆమె కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు.

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  పుష్ప సినిమాలో కీలక రోల్

  పుష్ప సినిమాలో కీలక రోల్

  ఇక అనసూయ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప అనే సినిమాలో నటిస్తోంది. కమెడియన్ సునీల్ భార్యగా ఆమె నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమాని ముందు ఒక భాగంగా రిలీజ్ చేయాలని భావించారు. అప్పుడు ఆమె పాత్ర తక్కువగానే ఉంటుంది. కానీ తాజాగా సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని భావించినప్పుడు ఆమె రోల్ బాగా పెరిగిందని అంటున్నారు. .

  English summary
  Star anchor anasuya bharadwaj made some interesting comments on power star Pawan Kalyan. In her recent interview anasuya bharadwaj made some interesting comments about Pawan Kalyan stardom.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X