రవితేజ సినిమాలో అనసూయ: హాట్ యాంకర్‌కు అలా వెల్‌కం చెప్పిన ‘ఖిలాడీ’
వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని సక్సెస్ బాటలోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. తనకు గతంలో 'డాన్ శీను', 'బలుపు' వంటి రెండు హిట్లను ఇచ్చిన గోపీచంద్ మలినేనితో 'క్రాక్' అనే సినిమాను చేసిన ఆయన.. ఈ సంక్రాంతి రేసులో నిలిచి విజేతగా అవతరించాడు. మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఈ రిజల్ట్ ఇచ్చిన జోష్ మీదున్న రవితేజ.. ఆ వెంటనే మరో సినిమానూ పట్టాలెక్కించేయడంతో పాటు ఉత్సాహంగా షూట్‌లో పాల్గొంటున్నాడు.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'ఖిలాడీ'. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు.. ఫస్ట్ గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.
జిమ్‌లో మలైకా అరోరా కసరత్తులు.. పోటి దుస్తులతో గ్లామర్ పంట

ఇదిలా ఉండగా, 'ఖిలాడీ'లో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర చేయబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె ఫొటోను షేర్ చేస్తూ.. వెల్‌కం చెప్పింది. ఆమె చేసేది ఏ పాత్ర అనే దానిపై వివరణ ఇవ్వలేదు కానీ.. ఇందులో అనసూయ రోల్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











