Disha Case: నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కుందా..? మంచు మనోజ్ కామెంట్.. అనసూయ రియాక్షన్
దిశా హత్యకేసులో ప్రధాన నిందితులైన నలుగురు యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పోలీసులు పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతున్నారు.
Recommended Video

తెల్లవారుజామునే దిశా నిందితుల ఎన్‌కౌంటర్
దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ నేటి (డిసెంబర్ 6) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్ చేశారు షాద్ నగర్ పోలీసులు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో ఆ నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేయడం జరిగింది.
టాలీవుడ్ ప్రముఖుల రియాక్షన్
దిశా నిందితుల ఎన్‌కౌంటర్ వార్త తెలిసి టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిశా హత్య కేసులో ఇప్పుడు అసలైన న్యాయం జరిగిందని, పోలీసుల చర్య హర్షణీయమని పేర్కొంటున్నారు.
హ్యాపీ.. ప్రౌడ్‌గా ఉంది అనేసిన అనసూయ
దిశా ఘటనపై స్పందించలేదని అనసూయపై ట్రోల్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తనను ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. దిశా నిందితుల ఎన్‌కౌంటర్ వార్త తెలిసి స్పందించింది. ''నేను హ్యాపీ'', ''ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నా'' అని పేర్కొంటూ ట్వీట్ చేసింది అనసూయ.
అల్లు అర్జున్ ట్వీట్
దిశా కేసులో న్యాయం జరిగింది అని పేర్కొంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.
భయపెట్టడమే మార్గం.. సమంత
''ఐ లవ్ తెలంగాణ. భయపెట్టడమే ఇలాంటి దుశ్చర్యలకు అసలైన సమాధానం'' అని సమంత ట్వీట్ పెట్టింది.
నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..?? మంచు మనోజ్
''ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది
ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది.
ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది.
నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..??
ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!'' అంటూ మంచు మనోజ్ ట్వీట్ పెట్టాడు.
లావణ్య త్రిపాఠి
న్యాయం జరిగింది. దిశా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా అని లావణ్య త్రిపాఠి పేర్కొంది.

దిశా ఘటన వివరాలు
గత నెల 27న దిశపై నలుగురు నిందితులు అత్యాచారం జరిపి.. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. 28న మధ్యాహ్నం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 29న షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల విచారణ జరిగింది. 30న నలుగురు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. ఈనెల 4న నిందితులను కోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. 5న చర్లపల్లి జైలులో నిందితులను సిట్ విచారించింది. నేడు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.


Click it and Unblock the Notifications











