Anasuya BharadwaJ: మరొక బోల్డ్ పాత్రలో అనసూయ.. ఇది అస్సలు ఊహించలేదుగా!
తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా తెగ ఫేమస్ అయిన ఈ బ్యూటిఫుల్ యాంకర్ గ్లామర్ ఒలకబోస్తూనే కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
అంతేకాకుండా సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేస్తూ కాస్తా వివాదంగా, ఎక్కువగా మంచి పేరు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం బుల్లితెర రంగాన్ని విడిచిపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది. తాజాగా మరో సినిమాలో బోల్డ్ లుక్ అవాతరం ఎత్తి షాక్ ఇచ్చింది ఈ బ్యూటిపుల్ యాంకర్.

విభిన్న పాత్రలు: బుల్లితెరపై యాంకర్ గా చలాకీతనంతో ఆకట్టుకోవడంతోపాటు గ్లామర్ ట్రీట్ అందిస్తుంటుంది. ఇటీవల అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో హై రేంజ్ గ్లామర్ ఒలకబోస్తోంది ఈ బ్యూటిఫుల్ యాంకర్. టీవీ షోలు, సోషల్ మీడియాలో ఎంత గ్లామర్ ఒలకబోసిన సినిమాల్లో మాత్రం విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది అనసూయ భరద్వాజ్.

క్షణం నుంచి: అడవి శేష్ క్షణం సినిమా నుంచి ఇటీవలి విమానం వరకు మంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంది అనసూయ. ఇక రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకులు ఎన్నడూ మర్చిపోని పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇలా రంగమార్తాండ, విమానం సినిమాలతో తనదైన మార్క్ చూపించిన అనసూయ అరి అనే మరో మూవీతో ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.

అరితోపాటు వూల్ఫ్: అరి (Ari Movie) సినిమాతోపాటు మరో కొత్త సినిమాతో అలరించేందుకు రెడీగా ఉంది బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా వూల్ఫ్ (Wolf Movie). వినూ వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సందేష్ నాగరాజు, సందేష్ ఎన్ నిర్మాతలుగా, బృందా జయరామ్ సహా నిర్మాతలుగా వ్యవహరించారు.

ఆసక్తిగా అనసూయ గెటప్: ప్రభుదేవా సినీ కెరీర్ లో 60వ చిత్రంగా వస్తున్న వూల్ఫ్ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. 69 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆడియెన్సును కొత్త లోకానికి తీసుకెళ్లేలా ఉంది. మంత్ర, తాంత్రిక శక్తులతో టీజర్ నింపేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవెల్ లో ఉంది. ఇక ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్, అనసూయ గెటప్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.

తాంత్రికురాలిగా: వూల్ఫ్ సినిమాలో అనసూయ కాషాయం రంగు దుస్తులు ధరించి సాధువులా కనిపించింది. కానీ, ఆమె ముందు ఓ శవం ఉండటం చూస్తుంటే ఆమె ఏదో తాంత్రిక విద్య తెలిసిన మహిళ పాత్ర చేస్తున్నట్లుగా ఉంది. విభిన్నమైన పాత్రలను చేస్తున్న అనసూయ ఇలా మరింత బోల్డుగా కనిపించడం అస్సలు ఊహించలేదంటూ టీజర్ చూసిన నెటిజన్లు, ఆడియెన్స్ అంటున్నారు.
అన్ని భాషల్లో: వూల్ఫ్ సినిమాలో వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాతలు కీలక పాత్రలు పోషించారు. అమ్రిష్ సంగీతం అందించారు. కెమెరామెన్ గా అరుల్ విన్సెంట్, ఎడిటర్ గా లారెన్స్ కిషోర్ పని చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











