పవన్ కళ్యాణ్ తో రంగమ్మత్త స్పెషల్ సాంగ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ.. తనదైన మార్క్ పాలనను చేస్తున్నారు. అయితే.. తన బాధ్యతలను నిర్వహిస్తూనే గతంలో ఒప్పుకున్న సినిమాలను, ప్రస్తుతం తాను చేయవలసిన సినిమాలను కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అయితే తాజాగా ఓ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది తెలియని పవర్ ఉంది. సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ కనిపిస్తే.. చాలు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. తన అద్భుతమైన నటనతో అటు క్లాస్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటారు. ఇకపోతే కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ.. రాజకీయాలపై ఫోకస్ పెట్టిన ఆయన పిఠాపురం నుండి ఎమ్మెల్యే గెలిచి ఏపీ రాజకీయాలను శాసిస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తన రాజకీయ జీవితంతో పాటు సినీ కెరీర్ పై కాస్త ఫోకస్ పెడుతూ ఉన్నారు.

ఈ క్రమంలోనే గతంలో ఆయన సాయం చేసిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి వంటి సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. పవన్ కళ్యాణ్ అందులో భాగంగానే ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు వేగంగా కంప్లీట్ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ మధ్యకాలంలో సినిమాలలో ఐటమ్ సాంగ్ లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇటీవల పాన్ ఇండియా మూవీ గా విడుదలైన పుష్ప 2 సినిమా లో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల అదిరిపోయే మాస్ స్టెప్పులేస్తూ స్పెషల్ సాంగ్లో గ్లామర్ షో ప్రదర్శించారు. ఈ సాంగ్ కు ఎనలేని ఆదరణ వచ్చింది.
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరివీర మల్లు సినిమాలో ఓ ఐటెం సాంగ్ ను పెట్టాలని మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్ లలో సమంత ఇటు శ్రీలీల అలరించిన విధానం తెలుసు. అయితే వీరిద్దరు కాకుండా..సిల్వర్ స్క్రీన్ పై రంగమ్మత్తగా ఫేమ్ సంపాదించుకున్న నటి అనసూయను రంగంలో దింపాలని భావిస్తున్నారు. అనసూయతో చేయించే స్పెషల్ సాంగ్ కు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నట్లు తెలుస్తుంది.
అలాగే ఈ నెంబర్ సాంగ్ ను ఎం ఎం కీరవాణి కంపోజ్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే.. పవన్ ఫ్యాన్స్ ఈ విషయంలో మాత్రం పెదవి వేరుస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











