twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనసూయను చూస్తే అసూయ పుట్టాల్సిందే.. వైరలవుతోన్న ఫోటోషూట్

    |

    అనసూయ అందాన్ని చూస్తే అందానికే అసూయ పుట్టాలి అనేట్టుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. యాంకర్‌గా కెరీర్ మొదలై బుల్లి తెరను ఓ ఊపు ఊపేస్తూ.. వెండితెరపై మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

    జబర్దస్త్ షోతో ఈమెకు క్రేజ్ వచ్చిందా? లేదా.. ఈమె వల్ల జబర్దస్త్‌కు క్రేజ్ వచ్చిందా అంటే అది అంతు చిక్కని ప్రశ్నే అవుతుంది. అనసూయ తన అందంతో షోకే వన్నె తెచ్చింది. అయితే అనసూయలో కేవలం గ్లామర్ మాత్రమే ఉందనుకుంటే పొరబాటే.. క్షణం, రంగస్థలం లాంటి సినిమాలతో మంచి నటిగా పేరు సంపాదించుకుంది.

    Anasuya Bharadwaj Pics Goes Viral In Meeku Matrame Chepta Promotions

    ప్రస్తుతం అటు బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోన్న అనసూయ.. మీకు మాత్రమే చెప్తా అనేందుకు సిద్దమవుతోంది. విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

    అయితే సినిమా విడుదలయ్యేందుకు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచే పనిలో పడింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలకు గానూ అనసూయ చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం కుర్రకారు మతిపోగొట్టేలా చేస్తోంది. నవ్వులతోనే గుండెను పిండేస్తూ ఉన్న అనసూయ ఫోటోలను చూసి ఫ్యాన్స్ లైకులు, షేర్లతో రెచ్చిపోతున్నారు.

    English summary
    Anasuya Bharadwaj Promotions For Meeku Matrame Cheptha Movie. Under Vija Devarakonda New Production Tharun Bhascker Introduce As Hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X