Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనసూయను చూస్తే అసూయ పుట్టాల్సిందే.. వైరలవుతోన్న ఫోటోషూట్
అనసూయ అందాన్ని చూస్తే అందానికే అసూయ పుట్టాలి అనేట్టుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. యాంకర్‌గా కెరీర్ మొదలై బుల్లి తెరను ఓ ఊపు ఊపేస్తూ.. వెండితెరపై మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
జబర్దస్త్ షోతో ఈమెకు క్రేజ్ వచ్చిందా? లేదా.. ఈమె వల్ల జబర్దస్త్‌కు క్రేజ్ వచ్చిందా అంటే అది అంతు చిక్కని ప్రశ్నే అవుతుంది. అనసూయ తన అందంతో షోకే వన్నె తెచ్చింది. అయితే అనసూయలో కేవలం గ్లామర్ మాత్రమే ఉందనుకుంటే పొరబాటే.. క్షణం, రంగస్థలం లాంటి సినిమాలతో మంచి నటిగా పేరు సంపాదించుకుంది.
ప్రస్తుతం అటు బుల్లితెరను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోన్న అనసూయ.. మీకు మాత్రమే చెప్తా అనేందుకు సిద్దమవుతోంది. విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అనసూయ ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.
అయితే సినిమా విడుదలయ్యేందుకు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచే పనిలో పడింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలకు గానూ అనసూయ చేసిన ఫోటోషూట్ ప్రస్తుతం కుర్రకారు మతిపోగొట్టేలా చేస్తోంది. నవ్వులతోనే గుండెను పిండేస్తూ ఉన్న అనసూయ ఫోటోలను చూసి ఫ్యాన్స్ లైకులు, షేర్లతో రెచ్చిపోతున్నారు.