మంత్రి కేటీఆర్‌కి అనసూయ రిక్వెస్ట్.. మాపై దయచూపండంటూ జబర్దస్త్ ట్వీట్

దేశవిదేశాలకు కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా అరికట్టడంలో భాగంగా కఠిన చర్యలు అమలు పరుస్తూ ప్రజల్లో అవగాహన నింపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 31 దాకా లాక్ డౌన్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ అంశంపై జబర్దస్త్ బ్యూటీ అనసూయ రియాక్ట్ అయింది. వివరాల్లోకి పోతే..

జనతా కర్ఫ్యూ సక్సెస్.. వెంటనే కేసీఆర్ ఆదేశాలు

జనతా కర్ఫ్యూ సక్సెస్.. వెంటనే కేసీఆర్ ఆదేశాలు

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 22వ తేదీ (ఆదివారం) ప్రజలంతా స్వచ్ఛదంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలంతా ఈ జనతా కర్ఫ్యూ సక్సెస్ చేసి కరోనాను అంతమొందించడంలో భాగమయ్యారు. దీంతో ఈ రోజు లాగే తెలంగాణలో మార్చి 31 దాకా లాక్ డౌన్ చేసి కరోనా కట్టడిలో అంతా భాగం కావాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రైవేట్ ఉద్యోగులకు వారం రోజుల పెయిడ్ లీవ్స్

ప్రైవేట్ ఉద్యోగులకు వారం రోజుల పెయిడ్ లీవ్స్

అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎవరూ ఇంటి నుంచి బయట అడుగు పెట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఇందుకు మినహాయింపు కాదని, ఆయా కంపెనీలు ప్రైవేట్ ఉద్యోగులకు ఈ వారం రోజులకు గానూ జీతం చెల్లించాలని ముఖ్యమంత్రి సూచించారు. అత్యవసర పరిస్థితులు, నిత్యవసర సరుకుల విషయంలో మాత్రమే బయటికి రావాలని.. అది కూడా ఇంటికి ఒక్కరు మాత్రమే అని కేసీఆర్ ఆదేశించారు.

గవర్నమెంట్ కాన్సెప్ట్.. అది కూడా లేదు

గవర్నమెంట్ కాన్సెప్ట్.. అది కూడా లేదు

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 వరకూ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను కూడా షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అంటే ప్రజా రవాణా పూర్తిగా రద్దు చేశారన్నమాట. మరోవైపు కేంద్రం కూడా రైళ్ల రాకపోకలపై నిషేదం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో.. జనం ఎక్కడివారు అక్కడే నిలిచిపోవాలనేది గవర్నమెంట్ కాన్సెప్ట్.

ఎంటరైన అనసూయ..

ఎంటరైన అనసూయ..

సామజిక మాధ్యమాల్లో ఎక్కువగా యాక్టివ్ రోల్ ప్లే చేసే అనసూయ.. సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రియాక్ట్ అయింది. ఈ మేరకు కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్‌కి ఓ రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హాట్ ఇష్యూగా మారింది.

Recommended Video

Mandakrishna Madiga Responded On 'Palasa 1978' Movie

దయ చూపండి.. జబర్దస్త్ బ్యూటీ రిక్వెస్ట్

''కేటీఆర్ సర్.. గవర్నమెంట్ సూచించిన సూచనలను గౌరవిస్తున్నాం. కానీ కొన్ని ప్రొఫెషన్స్‌ని విషయంలో సడలింపు చేయండి. పని చేయకపోతే మాకు డబ్బులు రావు. కానీ మేం మా ఇంటి రెంట్, కరెంట్ బిల్లు కట్టుకోవాలి. అదేవిధంగా EMI, నెలసరి బిల్స్ లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి కాస్త మాపై దయ చూపించండి'' అని పేర్కొంది అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X