ఏంరో!! ఏందీ కథా!! సూడనికే ఆగమాగమైతున్నాం.. మెగా వారసుడి మూవీపై అనసూయ ట్వీట్

బుల్లితెర, వెండితెర, ఆన్‌లైన్ వేదిక అన్నింటిలోనూ సూపర్ పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీ అనసూయ. చురుకుదనం దానిని తలదన్నే అందం రెండూ ఆమె సొంతం. అందుకే అనసూయకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌నెస్ గురించి ప్రత్యేకమైన వివరణ అవసరం లేదు. స్టార్ హీరోయిన్లను తదన్నేలా రోజురోజుకు క్రేజ్ పెంచుకుంటూ వస్తున్న ఈ హాట్ యాంకర్ తాజాగా వరుణ్ తేజ్ 'వాల్మీకి' గురించి ఆసక్తికర కామెంట్ చేసింది. వివరాల్లోకి పోతే..

వాల్మీకి రూపంలో వరుణ్ తేజ్

వాల్మీకి రూపంలో వరుణ్ తేజ్

డిఫెరెంట్ కథాంశాలు ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సారి వాల్మీకి రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ షూటింగ్ పూర్తికావడంతో పెద్దఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా సెప్టెంబర్ 9న వాల్మీకి ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలను మించి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ ట్రైలర్.

గద్దలకొండ గణేష్ హంగామా..

గద్దలకొండ గణేష్ హంగామా..

గద్దలకొండ గణేష్ రూపంలో వరుణ్ తేజ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన మేకోవర్, భాష, డైలాగులు ట్రైలర్‌లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో వాల్మీకి ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్టులో టాప్‌లో ఉండటం విశేషం.

ఏంరో!! ఏందీ కథా!! అంటూ రంగంలోకి అనసూయ

తాజాగా ఈ ట్రైలర్‌ని తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన అనసూయ కాస్త డిఫెరెంట్‌గా స్పందించింది. ''ఏంరో!! ఏందీ కథా!! మస్తుంది మీ కథ.. సూడనికే ఆగమాగమైతున్నాం..'' అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ట్యాగ్ చేసింది. నిజానికి ఈ డైలాగ్ ట్రైలర్ లోనిదే అయినప్పటికీ, అనసూయ దాన్ని ఈ రకంగా వాడి వావ్ అనిపించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

వాల్మీకి మూవీ

వాల్మీకి మూవీ

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన వాల్మీకి సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X