అనసూయ లైఫ్‌లో ఇన్ని కష్టాలున్నాయా? డబ్బుల్లేక చివరకు ఆ పని కూడా!
Recommended Video
ప్రతీ వ్యక్తి జీవితంలో కష్ట సుఖాలంటూ కొన్ని ఉంటాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి ఓ స్టేజ్‌కి వచ్చాక ఆ కష్ట సుఖాలు తలచుకుంటేనే భయమేస్తుంటుంది. అప్పట్లో అలా ఉండేవాళ్లం ఈ రోజుకు ఈ స్థాయికి వచ్చామా? అని తమలో తాము ఆనందపడుకుంటూ వాటిని నెమరు వేసుకోవడం సాధారణంగా అందరిలో చోటుచేసుకునే సంఘటనే. ఇలాంటి వాటికి సినీ తారలేం అతీతులు కాదు. వారికి కూడా కొన్ని మరచిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి కొన్ని జ్ఞాపకాలను తన పుట్టిన రోజు సందర్బంగా గుర్తు చేసుకుంది అనసూయ.

అనసూయ బర్త్ డే
1985 సంవత్సరం సరిగ్గా ఇదే రోజున (మే 15) జన్మించింది హాట్ భామ అనసూయ. చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదురీదుతూ లైఫ్‌లో ఈ స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ విశేషాలు, పెరిగిన పరిస్థితులను వివరించింది అనసూయ.

నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కావడంతో..
నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కావడంతో తమతో ఎక్కువ సమయం గడపలేక పోయేవారని, ఎక్కువగా తమ ఆలనాపాలనా విషయంలో అమ్మనే ప్రత్యేక శ్రద్ద తీసుకునేదని అనసూయ చెప్పింది. కొన్ని సందర్భాల్లో నాన్న డబ్బులు పంపక పోయినా ఎంతో కష్టపడి అమ్మనే తమకు అన్నీ సమకూర్చేదని చెప్పుకొచ్చింది.

బ్లౌజులు అమ్ముకుంటూ
ఈ రోజున తనీ స్థాయికి ఎదగడానికి కారణం అమ్మేనని అంటోంది అనసూయ. తమ చిన్నతనంలో చీరలు, బ్లౌజులు కుట్టి వాటిని అమ్ముకుంటూ తమ బడి ఫీజులు అమ్మనే కట్టేదని ఆమె పేర్కొంది. మాకు వేసుకోవడానికి బట్టలు కూడా అమ్మే కొనేదని, నాకు తెలిసి మా నాన్న ఏ ఒకటి రెండుసార్లు మాత్రమే బట్టలు కొనిచ్చారని, అంతా అమ్మ చేతుల మీదుగానే నడిచేదని ఆమె చెప్పుకొచ్చింది.

చివరకు పెళ్లి కూడా అలా
ఇంట్లో పరిస్థితి అలా ఉండటంతో చివరకు నా పెళ్లి కూడా లోనే తీసుకునే చేసుకున్నానని అనసూయ చెప్పింది. అయితే ఆ భగవంతుడి కృపతో తనకు శశాంక్ రూపంలో మంచి భర్త లభించాడని, లైఫ్ ఇలా నడుస్తోందని ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది ఈ హాట్ భామ.

ఇండస్ట్రీలో నెట్టుకురావడాని కారణం
గ్లామర్ రంగమైన సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని, ఎన్నో కష్టాలు అనుభవిస్తే గానీ ఈ రంగుల ప్రపంచాన్ని నెగ్గుకు రాలేమని ఆమె పేర్కొంది. అయితే అమ్మ నాన్న పెంపకమే తనను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసిందని చెప్పింది అనసూయ.

అనసూయ జర్నీ
పలు టెలివిజన్ కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ జబర్దస్త్ కామెడీ షో ద్వారా హాట్ యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అనసూయ. టాప్ యాంకర్‌గా రాణిస్తూనే మెల్లగా వెండితెరపై కాలుమోపి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్షణం, యాత్ర, రంగస్థలం వంటి చిత్రాల్లో నటించి వరుస అవకాశాలు పట్టేసింది. మరి కొద్దిరోజుల్లోనే అనసూయ లీడ్ రోల్ పోషించిన ప్రస్థానం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











