ముహూర్తం ఫిక్స్ చేసిన అనసూయ.. ఆగస్టులో ఆమె 'కథనం'

బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు సుపరిచమైన అనసూయ వెండితెరపై కూడా రాణిస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జున మరదలిగా మురిపించిన ఈమె మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమైంది. 'కథనం' అనే ఆసక్తికర కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.

ఆగస్టు 9 వ తేదీన అనసూయ 'కథనం' విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటిదాకా కనిపించని డిఫరెంట్ రోల్.. పైగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించనుంది అన‌సూయ‌. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన 'కథనం' మూవీ అనసూయ వెండితెర ప్రయాణాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని అంటున్నారు దర్శకనిర్మాతలు.

Anasuya Bharadwajs Kathanam Release Date Locked

రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'కథనం' చిత్రానికి బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా నిర్మాతలుగా వ్యవహరించారు. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ పతాకాలు సంయుక్తంగా సమర్పించాయి. చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం అందించగా స‌తీష్ ముత్యాల‌ సినిమాటోగ్రఫీ చేశారు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'కథనం' యు/ఎ సర్టిఫికేట్ పొందటమే గాక సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది. అనసూయ లీడ్ రోల్ పోస్తిస్తుండటం కారణంగా సినిమాపై భారీ హైప్ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X