twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏడవలేక నవ్వుతున్నా అంటూ అనసూయ ఎమోషన్.. సెన్సేషనల్ ఇష్యూ!

    |

    Recommended Video

    Anasuya Bharadwaj Fires On Netizens || ఎమోషనల్ అయిన అనసూయ

    సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బుల్లితెర హాట్ యాంకర్, సినీ నటి అనసూయ ఎమోషనల్‌గా ఫీల్ అవుతోంది. ఈ మేరకు సమాజం, మీడియా బాధ్యతలపై కామెంట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టింది అనసూయ. దీంతో ఈ ఇష్యూ కాస్తా హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ సమంత కామెంట్ ఏంటి? హాట్ టాపిక్‌గా ఎందుకు మారింది? పూర్తి వివరాలు చూస్తే..

    రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం

    రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అతిపెద్ద అటవీ ప్రాంతమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు సినీ ప్రముఖులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో ఇది కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

    ప్రభుత్వం కాన్సెప్ట్ ఇదే.. వ్యతిరేఖించిన అనసూయ

    ప్రభుత్వం కాన్సెప్ట్ ఇదే.. వ్యతిరేఖించిన అనసూయ

    నల్లమల అడవుల్లో భారీగా నిక్షేపితం అయి ఉన్న యురేనియం వెలికితీసి తద్వారా అణువిద్యుత్‌ను తయారు చేయాలనేది ప్రభుత్వం కాన్సెప్ట్. దీంతో ఈ చర్యను వ్యతిరేకిస్తూ అనసూయ ట్వీట్ చేసింది. ''ఇదేగా మన భవిష్యత్తు?? ఎలా అల్లో చేస్తున్నారు సార్ ఇదంతా?? ఆలోచించడానికే భయం వేయలేదా?'' అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌‌లను ట్వీట్‌లో ట్యాగ్ చేసింది అనసూయ.

    క్షమాపణ చెప్పిన అనసూయ

    క్షమాపణ చెప్పిన అనసూయ

    అయితే ప్రస్తుతం తెలంగాణలో జోగు రామన్న అటవీ శాఖ మంత్రి కాదు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో జోగు రామన్నకు స్థానం దక్కలేదు. ఆయన స్థానంలో ఇంద్రకరణ్ రెడ్డి పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడే అనసూయ పొరపాటు చేసింది. దీంతో తన తప్పుపై క్షమాపణ చెబుతూ తన అజ్ఞానాన్ని మన్నించి, ఇంటెన్షన్‌ మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ట్వీట్ చేసింది.

    హోరెత్తిన సోషల్ మీడియా.. అనసూయ ఎమోషన్

    దీంతో సోషల్ మీడియా అంతా అనసూయ క్షమాపణ గురించే హోరెత్తింది. ఈ విషయాన్ని గమనించిన అనసూయ.. ''హ హ.. ఏడవలేక నవ్వుతున్నా. ఇప్పుడే షూటింగ్ పూర్తి చేసుకుని నా సోషల్ మీడియా చెక్ చేస్తే అన్నీ.. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సారీ చెప్పిన అనసూయ' అనే వార్తలే కనిపించాయి. ఇందుకే కదా మనం ఎటూ కాకుండాపోయింది. దేని గురించి ఫోకస్ పెట్టాలి దేని గురించి పెడుతున్నారు? అసలు ఎప్పుడు బాధ్యతగా ఫీల్ అయ్యేది?'' అని ప్రశ్నించింది.

    ఇలా మీడియా వర్గాలను అనడం..

    ఇలా మీడియా వర్గాలను అనడం..

    నిజానికి అనసూయ అభిప్రాయం కరెక్ట్. కానీ ఆమె ఇలా మీడియా వర్గాలన్నింటి గురించి ఇలా అనడం కరెక్ట్ కాదనే చర్చ మొదలైంది జనాల్లో. అనసూయ ట్వీట్ల గురించి చెబుతూనే అందులో నల్లమల అడవుల సమస్యను కూడా మీడియా వర్గాలు కవర్ చేశాయి. మీడియా వర్గాలు వారి వారి హైప్ చూసుకున్నా కూడా.. ఆమె దేని గురించి ట్వీట్ చేశారు అన్న విషయం హైలైట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు ఆమె.. దేని మీద ఫోకస్ చేస్తున్నారు? అని ప్రశ్నించడం ఎందుకంటూ కొన్ని వర్గాలు గుర్రుగా ఉన్నాయి.

    English summary
    Tollywood is raising voice for the support of Save Nallamalla. Anasuya Bharadwaj tweeted it about it and says sorry. This issue is creating sensation in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X