Anasuya Bharadwaj's Vimanam ఎమోషనల్ పాత్రలో సముద్రఖని.. విమానం కథ ఏమిటంటే?

సినిమా కథల్లో భావోద్వేగంతోపాటు పాత్రల మధ్య బలమైన సెంటిమెంట్ ఉంటే విజయం సాధించడం తథ్యమనే విషయం గతంలో పలు సినిమాలు నిరూపించాయి. మరోసారి తండ్రి, కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంగా రాబోతున్న చిత్రం విమానం. ఈ చిత్రంలో సెంటిమెంట్ మాత్రమే కాకుండా హృదయాన్ని హత్తుకొనే సన్నివేశాలు కూడా ఉంటాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. విమానం సినిమా కథ ఏంటి? ఆ సినిమాలో పాత్రలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

విమానం సినిమా కథ : అంగవైకల్యంతో బాధపడే మధ్య వయసున్న తండ్రి పాత్ర వీరయ్యగా విలక్షణ నటుడు సముద్ర ఖని నటిస్తున్నాడు. భార్య వియోగంతో బాధపడే తండ్రి, తన కొడుకు బాగోగులు చూసుకొనే అవిటి తండ్రిగా ఎమోషనల్ పాత్రలో కనిపించబోతున్నారు. విమానం చిత్రాన్ని జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను చిత్ర నిర్మాతలు యూనిట్ సభ్యులు ఆవిష్కరించారు.

 Vimanam movie

సముద్రఖని చెప్పిందేమిటంటే? : ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమంలో సముద్రఖని మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక్కసారైనా తనను విమానం ఎక్కించమని కొడుకు కోరుతాడు. అయితే నీకు విమానం ఎక్కడం ఎందుకు ఇష్టమని అంటే.. పై నుంచి చూస్తే అన్నీ చిన్నగా కనిపిస్తాయి అని కొడుకు చెబుతాడు. అయితే బాగా చదువుకో విమానం నువ్వే సొంతంగా ఎక్కవచ్చు అని తండ్రి సలహా ఇస్తాడు. ఈ సినిమాలో తండ్రి, కొడుకుల మధ్య భావోద్వేగాలను చక్కగా రచయిత, దర్శకుడు శివ ప్ర‌సాద్ యానాల‌ ఎలివేట్ చేశారు అని అన్నారు.

విమానం ఎగిరేది ఎప్పుడంటే? :
జీ స్టూడియోస్‌ సౌత్ మూవీస్ హెడ్ అక్ష‌య్ క్రేజీవాల్ మాట్లాడుతూ... కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌తో అసోసియేట్ కావ‌టం చాలా సంతోషంగా ఉంది. మా కాంబోలో మంచి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు టీమ్‌గా చక్కటి సినిమాను నిర్మించాం. ఈ సినిమా కంటెంట్ తప్పకుండా అన్ని వర్గాలను ఆలరించేలా ఉంటుంది అని అన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 9 గ్రాండ్ రిలీజ్ అవుతుందని తెలిపారు.

విమానంలో నటీనటులు :

న‌టీన‌టులు: స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్ తదితరులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ ప్ర‌సాద్ యానాల‌
సినిమాటోగ్ర‌ఫీ: వివేక్ కాలేపు
ఎడిట‌ర్‌: మార్తాండ్ కే వెంక‌టేష్‌
మ్యూజిక్‌: చ‌ర‌ణ్ అర్జున్‌
ఆర్ట్‌: జేజే మూర్తి
డైలాగ్స్‌: హ‌ను రావూరి
నిర్మాతలు: జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి
బ్యానర్: కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌, జీ స్టూడియోస్‌
పీఆర్వో: నాయుడు, ఫ‌ణి (బియాండ్ మీడియా)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X