బాత్రూం కూడా వదలరా? మరీ ఇంత దారుణమా? అనసూయ ఆగ్రహం

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం తర్వాత ఆయనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను యూట్యూబ్ ఛానెల్స్, మీడియా ప్రసారం చేసిన తీరుపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 8న తెల్లవారుజామున జయప్రకాశ్ రెడ్డి బాత్రూంలో కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే. దాంతో సినీ ప్రముఖులంతా సోషల్ మీడియాలో స్పందించి సంతాపం ప్రకటించారు అయితే యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసిన తీరుపై అనసూయ భరద్వాజ్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా వైరల్‌ అయిన ట్వీట్‌లో ఆమె ఏమన్నారంటే..

విషాదంతో అనసూయ రియాక్షన్

విషాదంతో అనసూయ రియాక్షన్

దివంగత నటుడు జయ ప్రకాశ్ రెడ్డితో అనసూయ మంచి అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తి మరణ వార్త వినగానే ఆమె తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో జయప్రకాశ్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోని విలక్షణమైన నటుల్లో ఒకరు. మీ మరణ వార్త విని విషాదంలో మునిగిపోయాను అని అనసూయ తెలిపారు.

జయ ప్రకాశ్ రెడ్డి యాసను అనుకరిస్తూ...

జయ ప్రకాశ్ రెడ్డి యాసను అనుకరిస్తూ...

నేను టీవీ ఛానెల్‌లో పనిచేసే సమయంలో జయప్రకాశ్ రెడ్డి మాట్లాడే రాయలసీమ యాసను అనుకరించే ప్రయత్నం చేసేదానిని. నేను హోస్ట్‌గా పనిచేసిన ఓ షోలో నాటకరంగం గురించి చెప్పిన విషయాలు నాకు ఇంకా గుర్తున్నాయి. చాలా స్పూర్తిని కలిగించాయి. మీరు ఎప్పటికీ మా హృదయంలో ఉంటారు అని అనసూయ భరద్వాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా

వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా

అలాంటి ఉన్నత విలువలు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన జయప్రకాశ్ రెడ్డి మరణవార్తను ఆయన ప్రతిభను, టాలెంట్‌ను కించపరిచేలా ప్రచురించడంపై అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. బాత్రూంను కూడా వదలడం లేదు. మరణం విషయంలో కూడా విలువలు పతనమవుతున్నాయి అంటూ అనసూయ ట్వీట్ చేశారు.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
 అనసూయ ట్వీట్‌కు భారీగా రెస్పాన్స్

అనసూయ ట్వీట్‌కు భారీగా రెస్పాన్స్

జయప్రకాశ్ రెడ్డి మరణం గురించి అనసూయ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నది. అనసూయ వాదనను సమర్ధిస్తూ చాలా పోస్టులు పెడుతున్నారు. కొన్ని విషయాల్లో విలువలను, వ్యక్తుల మనోభావాలను పట్టించుకోవాలనే సూచన చేస్తున్నారు. అనసూయ ఆవేదనను అర్థం చేసుకొంటూ నెటిజన్లు మీడియాపై ట్రోల్స్ చేయడం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X