మద్యం తాగి రచ్చ రచ్చ చేశారట కదా..! సీరియస్ అయిన జబర్దస్త్ బ్యూటీ.. అనసూయ కౌంటర్స్

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే అనసూయ భరద్వాజ్.. తాజాగా ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా కాసేపు నెటిజన్లతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశాలకు సమాధానాలిస్తూ ఈ లాక్ డౌన్ సమయంలో కాస్త ఎంటర్‌టైన్ చేసింది. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న మాత్రం ఆమెను చిర్రెత్తించింది. దీంతో సీరియస్ అయిన జబర్దస్త్ బ్యూటీ అతనికి స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. ఆ వివరాలు చూస్తే..

యాంకర్ అనసూయ.. సోషల్ మీడియా క్వీన్

యాంకర్ అనసూయ.. సోషల్ మీడియా క్వీన్

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే సెలబ్రటీల్లో యాంకర్ అనసూయ ముందువరుసలో ఉంటుంది. ఎప్పుడూ తన రెగ్యులర్ అప్‌డేట్స్ పంచుకుంటూ, ఫ్రెష్ అండ్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ జబర్దస్త్ బ్యూటీకి ఆన్‌లైన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే.

ఆన్‌లైన్ చాటింగ్.. అనుకోని ప్రశ్న

ఆన్‌లైన్ చాటింగ్.. అనుకోని ప్రశ్న

ఈ నేపథ్యంలోనే తాజాగా అభిమానులతో ఆన్‌లైన్ చాటింగ్ చేసింది అనసూయ. అయితే ఈ చాటింగ్ లో భాగంగా ''తరుణ్‌ భాస్కర్‌తో కలిసి మద్యం సేవించి ఓ పార్టీలో రచ్చ రచ్చ చేశారట కదా?'' అని ఓ నెటిజన్‌ అడిగాడు. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన అనసూయ అతనిపై మండిపడుతూ స్ట్రాంగ్ కౌంటర్స్ వేసింది.

నాకు తెలిసి నువ్వు ఇంకా.. అనసూయ కౌంటర్స్

నాకు తెలిసి నువ్వు ఇంకా.. అనసూయ కౌంటర్స్

''ఈ 'అట' అనే పదాలు మీరు సరదాకి అనుకుంటే బాగుంటుంది.. కానీ నిజాలు వేరే ఉంటాయని, పరిణతి చెందితే నీకు కూడా అర్థమవుతుంది. నాకు తెలిసి నువ్వు ఇంకా పరిణతి చెందలేదేమో'' అంటూ జబర్దస్త్ కౌంటర్ వేసింది. గతంలోనూ చాలాసార్లు నెటిజన్లు చేసిన వల్గర్ కామెంట్స్‌పై ఫైర్ అయింది అనసూయ.

ఏ మాత్రం తగ్గని జబర్దస్త్ బ్యూటీ..

ఏ మాత్రం తగ్గని జబర్దస్త్ బ్యూటీ..

ఇకపోతే తన ఒంపు సొంపులతో బుల్లితెరకు కొత్త శోభ తీసుకొచ్చిన అనసూయ.. వెండితెరపై కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. విలక్షణ పాత్రలు పోషిస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఇటు బుల్లితెర, అటు వెండితెర అన్నట్లుగా సాగుతున్న ఆమె ప్రయాణం సాగుతోంది.

Recommended Video

Anchor Rashmi Gautam Feeding Road Dogs During Lockdown!
రంగమార్తాండలో అలా.. చిరంజీవితో ఇలా

రంగమార్తాండలో అలా.. చిరంజీవితో ఇలా

ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ సరసన నటిస్తోంది. ఈ చిత్రంలో సినిమాలో 'రంగస్థల నటి'గా అనసూయ కనిపించనుందని తెలుస్తోంది. అలాగే చిరంజీవి 'ఆచార్య' సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్ కోసం అనసూయను కన్ఫర్మ్ చేసినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X