Independence Day 2023: ఫ్రీడమ్ ఫైటర్ గెటప్పులో అనసూయ.. ఈ టాలెంట్ కూడా ఉందా?

భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చేందుకు ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కృషి చేశారు. వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారు. వారి గురించి ప్రతి ఏటా స్వాతంత్య్రదినోత్సవం రోజున స్మరించుకుంటాం. అయితే, వాళ్లలో మనకు కొందరి పేర్లు మాత్రమే ఎప్పుడు వినపడుతుంటాయి. బ్రిటిషర్స్ తో పోరాడి అమరులైన అనేకమంది స్వాతంత్య్రసమరయోధుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. అలాంటి వారిలో బేగం హజ్రత్ మహల్ (Begum Hazrat Mahal) ఒకరు. ఈమె గురించి తెలియనివారికి ఆమె రూపంలో దర్శనం ఇచ్చి సోషల్ మీడియా ద్వారా చాటి చెబుతుంది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్.

విభిన్న పాత్రలు: బుల్లితెరపై యాంకర్ గా చలాకీతనంతో ఆకట్టుకోవడంతోపాటు గ్లామర్ ట్రీట్ అందిస్తుంటుంది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో హై రేంజ్ గ్లామర్ ఒలకబోస్తూనే వివాదాలకు నెలవైంది. టీవీ షోలు, సోషల్ మీడియాలో ఎంత గ్లామర్ ఒలకబోసిన, వివాదాలు వచ్చినా సినిమాల్లో మాత్రం విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది అనసూయ.

Anasuya Bharadwaj

వరుస సినిమాలు: ప్రామిసింగ్ హీరో అడవి శేష్ క్షణం సినిమా నుంచి ఇటీవలి విమానం వరకు మంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంది ముద్దగుమ్మ అనసూయ. అయితే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకులు ఎన్నడూ మర్చిపోని పర్ఫామెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే రంగమార్తాండ, విమానం సినిమాలతో తనదైన మార్క్ చూపించిన అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది.

క్రేజీగా ట్రైలర్: అరి (Ari Movie) సినిమాతోపాటు మరో కొత్త చిత్రం వూల్ఫ్ (Wolf Movie)తో అలరించేందుకు రెడీగా ఉంది బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వినూ వెంకటేష్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది.

Anasuya Bharadwaj

అలా దర్శనం: ఇలా సినిమాలతో పాటు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ అందించే అనసూయ తాజాగా ఫ్రీడమ్ ఫైటర్ గెటప్పులో దర్శనం ఇచ్చి ఆమె గురించి తెలిసేలా చేసింది. 1857లో సైనిక తిరుగుబాు సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసి భారత స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు బేగం హజ్రత్ మహల్ (Begum Hazrat Mahal).

ప్రతిభకు నిదర్శనం: "నవాబ్ వాజిద్ అలీ షా యొక్క రెండో భార్య అయినా బేగం హజ్రత్ మహల్ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటీష్ పాలనపై రెండు దశాబ్దాలపాటు తిరుగుబాటు చేసి తన జీవితాన్ని అంకితం ఇచ్చారు. ఆమె చేసిన సేవలకు గాను మే 10, 1984న స్టాంపుతో స్మరించుకున్నారు. ఇది ఆమె ప్రతిభకు నిదర్శనం" అంటూ అనసూయ నోట్ రాసుకొచ్చింది.

Anasuya Bharadwaj

అనసూయ బేగమ్: అయితే బేగం హజ్రత్ మహల్ రూపంలో అచ్చంగా ఒదిగిపోయింది అనసూయ. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న ఈ ఫొటో బేగంను మైమరిపిస్తోంది. దీంతో ఈ ఫొటో నెట్టింట్లో ఎంతో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. 'అనసూయ బేగమ్', 'ఖుష్భూరత్ అనసూయ జీ', 'అనసూయలో ఈ టాలెంట్ కూడా ఉందా?' అని రాసుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X