నాగార్జున అంటే ఎప్పటికీ క్రష్.. ఆయన కౌగిలిలో అనసూయ.. ఏంటి ఇలా షాకిచ్చింది!
Recommended Video
బుల్లితెర హాట్ యాంకర్, నటి అనసూయ.. అక్కినేని నాగార్జునను ఉద్దేశిస్తూ జబర్దస్త్ కామెంట్ చేసింది. నాగార్జున అంటే తనకు ఎప్పటికీ క్రష్ అంటూ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఆయనతో దిగిన పిక్స్ షేర్ చేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటి? అనసూయ ఎందుకిలా అనేసింది? వివరాల్లోకి పోతే..

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున
నేడు (గురువారం) టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. 1959 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు జన్మించిన ఆయన.. నేటితో 60 వ సంవత్సరం లోకి అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

అనసూయ జబర్దస్త్ ట్వీట్
నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా జబర్దస్త్ ట్వీట్ చేసి ఆకట్టుకుంది హాట్ యాంకర్ అనసూయ. తనకు నాగార్జున అంటే ఎప్పటికీ క్రష్ అని పేర్కొంటూ నాగార్జునను కౌగిలించుకున్న పిక్ షేర్ చేసింది. అంతేకాదు నాగార్జునను ఎవర్ చార్మింగ్, యంగ్ అండ్ ఎవర్‌గ్రీన్ అని పొగిడేస్తూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది అనసూయ.
నాగార్జునతో అనసూయ
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా కొనసాగుతూనే వెండితెరపై కాలు మోపిన అనసూయ, అక్కినేని నాగార్జునతో కలిసి 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో నటించింది. ఈ సినిమాలో అనసూయ గ్లామర్ అప్పియరెన్స్, అభినయం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ద్వారానే నాగార్జున, అనసూయ మధ్య మంచి బాండింగ్ నెలకొందని సమాచారం.

బంగార్రాజు నాగార్జున
ఇక ఇటీవలే మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందిన నాగార్జున.. మరికొద్ది రోజుల్లో బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ లేదా నయనతార కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జున కొడుకు నాగ చైతన్య, కోడలు సమంత కూడా ఈ సినిమాలో భాగం కానున్నారు.


Click it and Unblock the Notifications