Liger మూవీ రిజల్ట్.. ఉసురు ఊరికే పోదు.. కర్మ అంటూ అనసూయా షాకింగ్ రియాక్షన్
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కిన లైగర్ మూవీ ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే విభిన్నమైన టాక్ తో కొనసాగుతోంది. సినిమా ఫైనల్ గా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుంది అనేది కలెక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది. అసలు సినిమా ఫస్ట్ డే ఎంత రాబట్టవచ్చు అన్నే దానిపైనే ఫోకస్ చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో యాంకర్ అనసూయ విజయ్ లైగర్ రిజల్ట్ పై పరోక్షంగా కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ..
డేరింగ్ ఆన్స్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గతంలో ఎప్పుడు లేని విదంగా విజయ్ దేవరకొండతో ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా చేశాడు. ఈ సినిమాపై మొదట నుంచి కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక సినిమాకు గురువారం రోజు వరల్డ్ వైడ్ గా విజయ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా రిజల్ట్ పై కొంత డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ విజయ్ మాత్రం నటనతో ఆదరగొట్టేశారని అంటున్నారు.

విజయ్ హై వోల్టేజ్ యాక్టింగ్
విజయ్ ఈ సినిమాలో పవర్ఫుల్ బాక్సర్ పాత్రలో నటించాడు. అలాగే నత్థితో కూడా మొదటి సారి ఒక విభిన్నమైన టైమింగ్ ఉన్న పాత్రలో నటించాడు. దానికి తోడు యాక్షన్ సన్నివేశాలు కూడా హైలెట్ అయ్యాయి. రింగ్ లో బాక్సర్ గా విజయ్ కనిపించిన విధానం హై వోల్టేజ్ వాతావరణాన్ని తలపించింది. అయితే పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్ ఇంకా బలంగా పది ఉండాల్సింది అని అంటున్నారు.

అనసూయ కామెంట్
ఇక సినిమా రిజల్ట్ పై వస్తున్న నెగిటివ్ టాక్ పై పరోక్షంగా యాంకర్ అనసూయ స్పందించినట్లు అనిపోస్తోంది. గతంలో విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో అమ్మను తిట్టే బూతు పదం ఏ మాత్రం కరెక్ట్ కాదని అలాగే జనాల జేత అనిపించిన విధానం కూడా దారుణం అంటూ అనసూయ మీడియా ఛానెల్స్ డిబేట్ లో చర్చించింది. విజయ్ ఫ్యాన్స్ కూడా అప్పట్లో అనసూయపై ట్రోల్స్ చేశారు.

ఉసురు ఊరికే పోదు..
ఇక ఇప్పుడు లైగర్ సినిమా విడుదలైన సమయంలో అనసూయ స్పందించిన విధానం హాట్ టాపిక్ గా మారింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!.. అంటూ ఆమె ట్విట్టర్ లో పేర్కొన్న విధానం అందరికి షాక్ ఇచ్చింది. అసలు లైగర్ విజయ్ పేరు ప్రస్తావించకుండా అనసూయ సెటైర్ వేసినట్లు చాలా క్లియర్ గా అర్ధమవుతోంది.

ఒకరి బాధతో సంతోషం దొరకదు
అలాగే అనసూయ మరో రెండు హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వడం వైరల్ గా మారింది. ఒకరి బాధతో సంతోషం దొరకదు అంటూ ఆమె చెప్పిన విధానం గతంలో చేసిన కామెంట్స్ కౌంటర్ అని అంటున్నారు. అలాగే విశ్వాసం పునరుద్ధరించబడింది అంటూ మరో హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. ఏదేమైనా అనసూయ చేసిన ట్వీట్ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక విజయ్ ఫ్యాన్స్ కూడా గతంలో అనసూయకు సంబంధించిన డబుల్ మీనింగ్ డైలాగ్ వీడియోలను పోస్ట్ చేస్తూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ ఈ కామెంట్స్ ఎంఐజా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











