అందుకే ఆయనను వదిలేశా.. విజయ్ దేవరకొండపై అనసూయ ఘాటుగా రియాక్షన్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో రౌడీస్టార్ తన భావాలను పంచుకొన్నారు. ఈ సినిమా కథ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి కావడంతో తాము కూడా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా ఫ్యామిలీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని ప్రమోషన్స్‌లో చెప్పారు. అయితే విజయ్ చెప్పిన మాటలపై నెటిజన్ ట్రోల్ చేస్తూ..
విజయ్ దేవరకొండ పీఆర్ మాఫియా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆయన ఏదేదో మాట్లాడుతుంటాడు. వెంటనే పీఆర్ రంగంలోకి దిగి.. తెలంగాణ హీరో మీద ద్వేషం ఎందుకు అని రుద్దడం.. నా కారులో పెట్రోల్ లేదు.. బైక్ కి సైలెన్స్ లేదు అని సింపథి క్రియేట్ జరుగుతున్నది. వీటిన్నిటి మీద అనసూయ ఆంటీ ని దింపడం జరుగుతూ వస్తూనే ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అయితే నెటిజన్ తన పేరు లాగడంపై అనసూయ ట్విట్టర్‌లో స్పందించింది. ఎందుకు కార్తీక్ గారు.. అస్తమానం నన్ను లాగుతారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి చెప్పి ఒదిలేశాను. అనవసరంగా నేనే హైప్ ఇస్తున్నానని.. నా వాళ్లు అంటుంటే.. నిజమేనేమో అని ఒదిలేశాను అని అనసూయ అన్నారు.
నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ నాకు సింపథీ అక్కర్లేదు. నాకు నా మీద నమ్మకం. నా దేవుడి మీద నమ్మకం. మా అమ్మ నాన్నలు నాకిచ్చిన విలువలు, పెంపకం.. నన్ను నా దృష్టిలో ఎప్పుడూ దిగజారనివ్వవు. ఇప్పుడు ఈ ట్వీట్‌ని కూడా తమ స్వార్దానికి వాడుకున్నా నేను ఆశ్చర్యపోను. కానీ నాకు వాళ్లకి ఎలాంటి సంబంధం, ఎప్పుడు లేదు అని అనసూయ భరద్వాజ్ తెలిపారు.
నాకు తెలిసి మీరెవరో నాకు తెలియదు. మీరు నేను చుట్టాలం అసలు కాదండి. నేను మీకు ఆంటీ కాదేమో, అయినా ఒకసారి మీ ఇంట్లో అడగండి.. మీకు తెలియకుండా ఏమన్నా రిలేషన్ ఉన్నాయేమో. ఎందుకంటే నాకు చుట్టాలైతనే ఆ పలకరింపులు ఉంటాయని, నాకు నా పెద్దవాళ్లు నెర్పించారు. ఎనీ వే విషింగ్ యూ వెల్ అండి అని ట్వీట్‌లో సమాధానం ఇచ్చింది.
అయితే తాను వదిలేశానని అంటూనే పరోక్షంగా విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేయడంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు రౌడీస్టార్‌కు సపోర్టే చేస్తే.. మరికొందరు రంగమ్మత్తకు మద్దతుగా నిలిచారు. అయితే ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా? లేదా దీనికి కొనసాగింపు ఉంటుందా? అనేది వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











