అందరినీ బయటకు లాగుతా.. ఎవ్వరినీ వదలను.. జబర్ధస్త్ బ్యూటీ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended Video
జనాల్లో సోషల్ మీడియా ప్రభావం నానాటికీ పెరిగిపోతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఉచిత ఇంటర్నెట్ సేవలు లాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక నేటి యువత ప్రపంచాన్నే అరచేతిలో బంధించేస్తోంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల సంగతులు తెలుసుకోవడం, వారిపై కామెంట్స్ చేయడం, కొన్ని సందర్భాల్లో ట్రోల్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలపై యాంకర్ అనసూయ ఘాటుగా స్పందించింది. వివరాల్లోకి పోతే..

యాంకర్ అనసూయ.. సోషల్ మీడియా క్వీన్
సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే సెలబ్రటీల్లో యాంకర్ అనసూయ ముందువరుసలో ఉంటుంది. ఎప్పుడూ తన రెగ్యులర్ అప్‌డేట్స్ పంచుకుంటూ,
ఫ్రెష్ అండ్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ జబర్దస్త్ బ్యూటీకి ఆన్‌లైన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే.

తప్పని ట్రోలింగ్స్.. బూతు కామెంట్స్
అయితే ఇదే సోషల్ మీడియాలో అనసూయను పొగుడుతూ కామెంట్స్ పెట్టేవారు కొందరైతే, అదే ప్లాట్‌ఫామ్‌పై ఆమెను బూతు కామెంట్లతో ఇబ్బంది పెట్టేవారు ఇంకొందరు ఉన్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ కామన్ అనుకొని ఇన్నిరోజులు కాస్త సైలెంట్‌గా ఉన్న అనసూయ.. తాజాగా ఓ వీడియో ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

పోనీలే అని వదిలేస్తే.. అనసూయ ఆగ్రహం
చాలా ఏళ్లుగా తనపై అసభ్యకరమైన కామెంట్స్ చేసినా పట్టించుకోలేదని, కానీ వదిలేస్తుంటే మితిమీరి పోతున్నారని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి తాను సీరియస్‌గా తీసుకోబోతున్నానని, ఇలాంటి కామెంట్స్ రిపీట్ అయ్యాయంటే ఎప్పుడూలేని విధంగా సామూహికంగా అరెస్ట్‌లు జరుగుతాయని పేర్కొంటూ ఫైర్ అయింది.

వల్గర్ కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు
గత కొన్నిరోజులుగా అనసూయపై సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ బాగా పెరిగాయి. ఈ మేరకు ట్విట్టర్ యాజమాన్యంతో పాటు, సైబర్ క్రైమ్ పోలీసులను కూడా సంప్రదించింది అనసూయ. తనపియా వచ్చిన కామెంట్స్ తాలూకు స్క్రీన్‌షాట్స్ తీసి ఇలాంటి అకౌంట్స్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది.

జబర్దస్త్ బ్యూటీ ఛాలెంజ్
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో లైవ్ వీడియో చేసిన అనసూయ.. తనకు సపోర్ట్ చేసినవారికి థ్యాంక్స్ చెబుతూ, గతంలో కామెంట్స్ చేసిన వారికి ఛాలెంజ్ విసిరింది. తాను అవసరంగా కామెంట్స్ చేసేవారికి రిప్లై ఇచ్చి హైప్ ఇస్తున్నానని వార్తలు వస్తున్నాయని చూశానని చెప్పింది. అయినా హైప్ ఇవ్వడం ఏంటండి? హైప్ ఇస్తే హైప్ అయిపోతారా. దయచేసి కొంచెం బుద్ధి వాడండి. ఈ విషయంలో జబర్దస్త్ షోను లాగకండి అంటూ అనసూయ కోపంతో ఊగిపోయింది.

అందరినీ బయటకు లాగుతా.. అనసూయ వార్నింగ్
తనపై వస్తున్న వల్గర్ కామెంట్స్ చేతున్న అందరినీ బయటకు లాగేస్తానని చెప్పింది అనసూయ. సామూహికంగా అరెస్ట్‌లు జరుగుతాయని చెప్పింది. ఈ లోగానే నాపై దరిద్రమైన కామెంట్స్ చేసిన వారు డిలీట్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పింది అనసూయ.

ఇకనుంచి ఉరుకునేదే లేదు
గతంలో అయితే తనపై వల్గర్ కామెంట్స్ చేస్తే కూడా.. పోనీలే వారి జీవితాలను ఎందుకు నాశనం చేయాలని ఆలోచించేదాన్ని.. కానీ ఊరుకుంటుంటే అవి శృతిమించి పోతున్నాయి. కాబట్టి ఇకనుంచి మాత్రం అస్సలు ఊరుకోను అంటూ స్ట్రాంగ్‌గా చెప్పేసింది జబర్దస్త్ బ్యూటీ అనసూయ.


Click it and Unblock the Notifications











