అనసూయ నీ ఆస్తులు భర్తకే చూపించుకో.. చీర ఛాలెంజ్ అంటూ బీజేపీ నేత దారుణంగా!

దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళ వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమయ్యాయి. అయితే శివాజీ వ్యాఖ్యలను తప్పుపడుతూ నటి అనసూయ భరద్వాజ్ ఘాటుగా స్పందించింది. శివాజీ మాటలు మహిళలను కించపరిచే విధంగా ఉంది. వస్త్రధారణ అనేది మహిళల ఇష్టానికి సంబంధించింది. ఒకరు చెబితే.. ఒకరి ఇష్టాయిష్టాలకు సంబంధం లేనిది అని సమాధానం ఇచ్చారు. అయితే శివాజీ, అనసూయ మద్య జరిగిన మాటల యుద్ధం సినీ, రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. అయితే అనసూయ వివాదంపై సామాజిక కార్యకర్త, బీజేపీ నేత ప్రభాగౌడ్ చేసిన కామెంట్స్, ఆమె చీర ఛాలెంజ్ మరో వివాదానికి దారి తీసింది. తాజా వివాదం ఏమిటి? సింగర్ చిన్మయి స్పందించిన తీరు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

అనసూయ వస్త్రధారణ విషయంలో చాలా మంది ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలా మంది ఆర్టిస్టులు, చాలా మంది పెద్దవాళ్లు, చిన్నవాళ్లు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసి నేర్చుకోవాలని అనసూయకు సలహా ఇస్తున్నాను. తన ఆస్తులను భర్తకే చూపించాలి. బయట వాళ్లకు కాదు. అందుకే ఆమెకు వస్త్రధారణ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి నేను ఆమెకు చీరను ఒకటి పంపిస్తున్నాను. ఆమెకు చీరను గిఫ్ట్‌గా వాళ్ల ఇంటికి పంపిస్తున్నాను అని డాక్టర్ ప్రభాగౌడ్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో అన్నారు.

Anasuya Bharadwaj Controversy

అంతేకాకుండా ఎవరైతే అనసూయ పద్దతిగా చీరకట్టుకోవాలని అనుకొంటారో.. ఆమెకు ఒక చీరను ఆమెకు బహుమతిగా పంపించండి. అలా చీర పంపిస్తే పద్దతిగా మారుతుందో ఏమో. అనసూయకు చీర కట్టుకోవాలనే ఉద్దేశంతో చీర ఛాలెంజ్‌ను ప్రారంభిస్తున్నాం. ఎవరైతే చీర కట్టుకొని పద్దతిగా బ్లౌజ్ వేసుకోవాలని భావిస్తారో.. నా మాదిరిగానే ఆమెకు చీరను బహుమతిగా పంపించండి అని ప్రభాగౌడ్ చురకలు అంటించారు.

అయితే ప్రభాగౌడ్ వీడియోపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించారు. బీజేపీకి చెందిన మహిళా పొలిటిషియన్ గురించి ఆమె పోస్టు పెడుతూ.. అనసూయకు పద్దతిగా చీరకట్టు గురించి చెప్పడానికి ఆమెకు ఓ సారీని గిఫ్టుగా పంపించే ఛాలెంజ్‌ను ప్రారంభించారు. ఇలా కార్యక్రమాన్ని చేపట్టడం ఇలాంటి దారుణాన్ని ఎక్కడ చూడలేదు. ఓ మహిళను మరో మహిళ వేధించే తిరోగమాన వ్యవహరం సహించలేనిది. వస్త్రధారణ విసయంలో మహిళను ఇలా వేధించడం సరికాదు అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రపంచంలో మహిళలను వేధించడం తప్ప రాజకీయ నాయకులకు పనిలేదా? అని సింగర్ చిన్మయి ప్రశ్నించారు. డాక్టర్ ప్రభాగౌడ్ ఫోటోను, ఇన్స్‌టాగ్రామ్ వీడియోను, అలాగే ఆమె ప్రొఫైల్‌ను తన పోస్టుతోపాటు ట్యాగ్ చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ పోస్టుపై అనసూయ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

దండోరా ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. మన హీరోయిన్లు వేసుకొనే బట్టలు చూస్తే మనకే దరిద్రమనిపిస్తుంటుంది. హీరోయిన్లు ఏమనుకొన్నా పర్వాలేదు. మీ అందం నిండుగా కట్టుకొనే చీరలో.. నిండుగా కప్పుకొనే దుస్తుల్లోనే ఉంటుంది తప్పితే.. సామాన్లు కనపించే దుస్తుల్లో ఉండదు. మీరు అర్ధనగ్నంగా కనిపించే దుస్తులు వేసుకొన్నప్పుడు చాలా మంది మీ ముందు నవ్వుతారు. కానీ మనసులో దరిద్రపు ముండ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకొంటారు? కొంచెం మంచి బట్టలు వేసుకొంటే బాగుంటుంది కదా అని లోపల అనాలనిపిస్తుంది. ఆ మాటలు బయటకు అనలేం. స్త్రీ అంటే ప్రకృతి.. ఎంత అందంగా ఉంటే.. అంత గౌరవం పెరుగుతుంది. ప్రకృతి మాదిరిగానే మా అమ్మ సావిత్రి, సౌందర్య మాదిరిగా చక్కగా కనిపిస్తుంటుంది. గ్లామర్ ఒక దశ వరకే ఉండాలి. కానీ హద్దు మీరి ఉండకూడదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. మనం వేష, భాషల వల్లే గౌరవం, స్వేచ్ఛ లభిస్తుంది. చీరకట్టు మహిళలకే విశ్వసుందరి అవార్డులు లభించాయి అని అన్నారు.

More from Filmibeat

Read more about: anasuya bhardwaj shivaji chinmayi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X