చీరలో అనసూయ అందాలు.. ఫోటో ‘షూట్’ చేసిన జబర్దస్త్ బ్యూటీ
అమ్మ బ్రహ్మ దేవుడో.. కొంప ముంచినావురో.. ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో.. అని పాడుకునేలా చేస్తోంది అనసూయ భరద్వాజ్. క్షమించండి అలా అంటే కొద్దిమందికి కోపం వస్తుందేమో. ఆమె హార్ట్ కోర్ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ ఆమెను అనసూయగానే చూస్తారు. అందానికి అసూయ పుట్టేలా ఉన్న అనసూయ.. బుల్లితెరను ఓ ఊపు ఊపుతోంది. వెండితెరపై నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ.. నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇటు గ్లామర్ పరంగా, అటు నటన పరంగానూ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోంది అనసూయ.

బుల్లితెర షోలతో బిజీబిజీ..
జబర్దస్త్ షోతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అనసూయ వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోయింది. అనసూయ కోసమే షోను చూసిన వారున్నారంటే అతిశయోక్తి కాదు. మొదట్లో ఆమె గ్లామర్‌తోనే జబర్దస్త్ మెల్లిగా పుంజుకోవడం ప్రారంభించింది.

వెండితెరపైనా అదృష్టం..
బుల్లితెరపై ఎంత వయ్యారాలను వొలకబోసినా.. వెండితెరపైనా తనలోని నటిని నిరూపించే పాత్రలే వచ్చాయి. క్షణం ఒకెత్తు అయితే రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర మరో ఎత్తు. అనసూయ కాస్త రంగమ్మత్తగా మారిపోయిందంటే.. ఎంతలా జీవించి నటించిందో అర్థమవుతోంది.

ఐటెమ్ సాంగ్‌తోనూ..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రం విజేతలో అనసూయ అదిరిపోయే స్టెప్పులను వేసింది. అనసూయ నర్తించిన ఆ ప్రత్యేక గీతం కూడా ఆమె పేరుతోనే ఉండటం మరో ప్రత్యేకత. ఆ పాట సోషల్ మీడియాలో ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.
కొత్త షోలోనూ హంగామా..
తాజాగా జీ చానెల్‌లో ప్రారంభించిన లోకల్ గ్యాంగ్స్ అనే కొత్త షోలోనూ హంగామా చేస్తోంది. నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక.. లోకల్ గ్యాంగ్స్ అనే మరో షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటు జబర్దస్త్‌ను మ్యానేజ్ చేసుకుంటూనే అటు కొత్త ప్రోగ్రామ్‌లకు కూడా చేసేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది.
Recommended Video

తాజా ఫోటో షూట్ వైరల్..
ఫోటో షూట్లతో అందర్నీ షూట్ చేసేస్తోంది. తెల్ల చీరలో అనసూయ అందాలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. తెల్ల చీరకు తకదిమి తపనలు రేగేనమ్మ సందే వెన్నెల్లో అని మరో పాట గుర్తొచ్చేలా అనసూయ మెరిసిపోతోంది. ప్రస్తుతం అనసూయ.. కృష్ణవంశీ రంగమార్తాండలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











